Hitech City Railway Station: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS)లో భాగంగా చేపట్టిన ‘నయా భారత్ – నయా స్టేషన్’ కార్యక్రమం కింద ఈ పునర్‌వికాసం కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రవేశ ర్యాంపులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వంటి ముఖ్యమైన సౌకర్యాలు నిర్మాణ దశలోనే దాదాపు పూర్తవగా, మొత్తం ప్రాజెక్ట్‌ను రూ. 26.60 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్నారు.
Chris Woakes: జట్టు విజయం కోసం ఇంగ్లాండ్ ప్లేయర్ సాహోసోపేత నిర్ణయం.. కానీ చివరకు!
పునర్‌వికాసం అనంతరం హైటెక్ సిటీ స్టేషన్ పూర్తిగా కొత్త రూపంలో కనిపించనుంది. అనవసర నిర్మాణాలను తొలగించి మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయడం, పార్కింగ్ స్థలాన్ని విస్తరించి ఆధునాతన సదుపాయాలతో మార్చడం, దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక వసతులు కల్పించడం వంటి పనులు జరుగుతున్నాయి. అదనంగా, పర్యావరణానికి అనుకూలంగా గ్రీన్ ఎనర్జీ వినియోగంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆధునిక శిల్పకళతో, ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఈ స్టేషన్‌ను నగర కేంద్రంగా మలచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ ప్రాజెక్ట్ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోందని చెప్పారు. పూర్తయిన తర్వాత హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆధునిక ఫసాడ్‌తో, విస్తృత సర్క్యులేటింగ్ ఏరియాతో, ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరి, హఫీజ్‌పేట్, బేగంపేట్, హుప్పుగూడ, హైదరాబాద్ స్టేషన్లలో కూడా పునర్‌వికాస పనులు జరుగుతున్నాయి.
హైటెక్ సిటీ స్టేషన్ అభివృద్ధి పూర్తయిన తర్వాత ఇది నగరంలో ప్రధాన రైల్వే హబ్‌గా మారి, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించనుంది.
Vivo Y400 5G: వివో నుంచి వివో Y400 5G మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్.. ప్రీమియం ఫీచర్లు
