Bajrang Dal: ప్రేమికుల రోజు అంటూనే భజరంగ్ దళ్ రంగంలోకి దిగాల్సిందే. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజూ కాదంటూ.. వాలెంటైన్స్ డే పేరుతో ఈవెంట్లు, ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్లను అడ్డుకుంటామని భజరంగ్ దళ్ రచ్చ మెదలైంది. ప్రేమికుల రోజును బ్యాండ్ చేయాలని హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ఫ్లాకాడ్స్ తో భజరంగ్ దళ్ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పుల్వామా దాడిలో మృతి చెందిన సైనికులకు బజరంగ్దళ్ కార్యకర్తలు నివాళులర్పించారు. అయితే.. ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రేమికుల దినోత్సవంను బహిష్కరించాలని హిందూ సంస్థలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కాగా.. ప్రతి ఏటా ఫిబ్రవరి 14న జరుపుకునే కాకుండా ఆ రోజు వీరజవాన్ల దినోత్సవంగా జరుపుకోవాలని పేర్కొన్న భజరంగ్ దళ్.. ప్రేమికుల రోజు మన సంస్కృతి కాదని.. అదే తేదీన పుల్వామా దాడిలో చనిపోయిన మన వీర జవాన్లను యువతీ యువకులు స్మరించుకోవాలని భజరంగ్ దళ్ వాల్ పోస్టర్‌ను రిలీజ్ కూడా చేసింది.
Read also: Boy Suicide: కొత్త చెప్పులు కొనివ్వలేదని పదేళ్ల బాలుడు ఆత్మహత్య
ఆనేపథ్యంలో.. వాలంటైన్స్ డేను బహిష్కరించాలని కోరుతూ రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాగా.. వీహెచ్‌పీ జనరల్ సెక్రటరీ పండరినాథ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 14న ప్రజలంతా అమర జవాన్లకు నివాళులు అర్పించాలని, దేశం కోసం పనిచేస్తున్న వీరజవాన్లను స్మరించుకోవాలన్నారు. అయినా కూడా ఎవరైనా వాలంటైన్స్ డే జరుపుకొంటూ పార్కులు, పబ్బులు, హోటళ్లు ఇతరత్రా చోట్ల కనిపిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే.. 2019 ఫిబ్రవరి 14న శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగి 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సైనికులు మరణించిన విషయం తెలిసిందే..
Read also: Rashmi: బ్లాక్ అండ్ వైట్‌లో రష్మీ.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.
ఇది ఇలా ఉండగా… వాలెంటైన్స్ డే బహిష్కరణ పిలుపులు.. ప్రేమికులకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని చెబుతున్న కొన్ని సంస్థలు.. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇవాళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కులు, యూనివర్సిటీలు, పబ్బులు, హోటళ్లు, మాల్స్, నెక్లెస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయనున్నారు. నగరంలోని ఐదు జోన్లలో చేయాల్సిన ఏర్పాట్లపై సన్నాహాలు ప్రారంభించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు ప్రైవేట్ బౌన్సర్లకు మంచి డిమాండ్ ఉంది. నగరంలోని పబ్‌లు, మాల్స్, రెస్టారెంట్ల యజమానులు వీరిని రోజువారీ కూలీకి తీసుకుంటున్నారు. వార్నింగ్ ఇచ్చిన వారిపై నిఘా ఉంచి అవసరమైతే ముందస్తు అరెస్టులు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ఐదు జోన్లలో పశ్చిమ మండలం చాలా ముఖ్యమైనది. అనేక పబ్బులు, రెస్టారెంట్లు అలాగే మాల్స్, పార్కులు ఇక్కడ ఇతర కీలక ప్రదేశాలు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనలు, సమయపాలన ఉల్లంఘించకుండా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు.
Jio Valentine’s Day Offer: ప్రేమికుల రోజు.. ‘జియో’ ఆఫర్ల జల్లు..