Site icon NTV Telugu

High Court Of Telangana : భద్రాచలం ఎన్నికలపై విచారణ

భద్రాచలం ఎన్నికలు నిర్వహించడం లేదన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. భద్రాచలం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్.వీరయ్య పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆ పిటిషన్‌ విచారణ జరిపింది. భద్రాచలం పంచాయతా..? మున్సిపాలిటా? ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదని ఎస్ఈసీ హైకోర్టుకు తెలిపింది. పలుమార్లు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు వివరించింది. ఐదేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భద్రాచలం ఎన్నికలపై 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. వివరణ ఇవ్వకపోతే సీఎస్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని హైకోర్టు వెల్లడించింది. అంతేకాకుండా భద్రాచలం ఎన్నికలపై విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Exit mobile version