Hyderabad High Alert: బెంగళూరులోని హోటల్ రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన తర్వాత హైదరాబాద్‌లో నగర పోలీసులు హైఅలర్ట్ ఏర్పాటు చేశారు. పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్ తదితర పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు మాల్స్‌లో కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు కొన్ని చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. దిల్ షుక్ నగరంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను తనిఖీ చేస్తూ.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీ చేసిన తర్వాతే అందరినీ అనుమతిస్తున్నారు. బెంగళూరులోని జరిగిన ఘటన హైదరాబాద్ కోఠిలోని గోకుల్ ఛాట్ బాంబ్ బ్లాస్ట్ ను తలపించేలా జరిగింది. దీంతో హైదరాబాద్ నగర పోలీసులు అలెర్ట్ అయ్యారు.
Read also: Stock Market : రికార్డులను బద్దలు కొట్టిన స్టాక్ మార్కెట్.. ఆరు గంటల్లో రూ.4.16 లక్షల కోట్లు
నిన్న మధ్యాహ్నం మేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తి బ్యాగ్‌ని రెస్టారెంట్‌లో వదిలేశాడు. అందులోని బాంబు పేలినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పేలుడులో ఐఈడీ ఉపయోగించినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ధృవీకరించారు. ఐఈడీని పేల్చేందుకు టైమర్‌ను ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘోర పేలుడు దృశ్యాలు కేఫ్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రజలు భోజనం చేస్తున్న సమయంలో దుండగుడు బాంబును అమర్చినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా పేలుడు రావడంతో ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. చాలా మంది భయంతో బయటకు పరుగులు తీశారు. గాయపడిన వ్యక్తులు నేలపై పడి ఉన్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది గాయపడ్డారు. రాష్ట్ర హోంమంత్రి సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారని సీఎం తెలిపారు. మరోవైపు ఈ కేసును ఎన్‌ఐఏ విచారించే అవకాశం ఉంది. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. కేఫ్ పరిసర ప్రాంతాలను పోలీసులు చుట్టుముట్టారు.
TS Inter Exams 2024: నో టెన్షన్.. నిమిషం నిబంధన తొలగించిన ఇంటర్ బోర్డు