NTV Telugu Site icon

Allu Arjun Wife: భావోద్వేగానికి గురి అయిన అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

Allu Arjun Wife

Allu Arjun Wife

Allu Arjun Wife: అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 6.40 నిమిషాలకు చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ తండ్రితో కలిసి ముందుగా జూబ్లీ హిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే కాసేపు వున్నారు. అనంతరం ఇంటికి బయలు దేరారు. ఇంటి వద్ద అల్లు అర్జున్‌ రాక కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు.. బన్నీని చూసి భావోద్వేగానికి గురయ్యారు.

Read also: Controversies Rock Tollywood: తెలుగు ఇండస్ట్రీకి దిష్టి.. వివాదాల్లో చిక్కుకుంటున్న స్టార్ సెలబ్రిటీలు..

ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌ ను భార్య స్నేహా రెడ్డి ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అల్లుని చూసిన ఆనందం మరోవైపు రాత్రంతా తన కోసం ఎదురుచూసిన ఆవేదన రెండు స్నేహ రెడ్డి మొఖంలో కనిపించాయి. అల్లు అర్జున్‌ ను చూసిన ఆనందంలో స్నేహ కళ్లలో కన్నీరు కదిలాయి. తన భార్య స్నేహ రెడ్డిని కలిసిన అనంతరం పిల్లలు, అమ్మతో అల్లు అర్జున్‌ ఆలింగనం చేసుకున్నారు. గుమ్మడికాయతో దిష్టి తీసి కుటుంబ సభ్యులు అల్లు అర్జున్‌ను ఇంట్లోకి ఆహ్వానించారు.

Read also: TGPSC Group 2 Exam: రేపటి నుంచి గ్రూప్‌-2 పరీక్షలు.. ఓఎంఆర్‌ పద్ధతిలో పరీక్షల నిర్వహణ..

కుటంబ సభ్యులను కలిసిన అనంతరం అల్లు అర్జున్‌ మీడయాతో మాట్లాడారు. నాకు మద్దతు తెలిపి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నేను చట్టాని గౌరవిస్తాను. నేను బాగానే వున్నాను అన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కోర్టులో కేసు ఉంది ఇప్పుడు నేను ఏం మాట్లాడలేను అని అల్లు అర్జున్ అన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన. ఇంటి వద్దకు చేరుకున్న అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవతి కుటుంబానికి సానుభూతి అల్లు అర్జున్ తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అన్నారు. నాకు మద్దుతు తెలిపిన అందరికి నా ధన్యవాదాలు తెలిపారు. మీడియాతో మాట్లాడిన అనంతరం అల్లు అర్జున్‌ ఇంట్లోకి వెళ్లిపోయారు.
Allu Arjun@7697: అల్లు అర్జున్కు ఖైదీ నెంబర్ 7697..

Show comments