NTV Telugu Site icon

యాదాద్రి బలాలయంలోకి చేరిన వర్షం నీరు

తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు రావడంతో భారీ వర్షం కురుస్తుంది. యాదగిరిగుట్టలో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలోకి వర్షపు నీరు చేరింది. వాన నీటితో యాదాద్రి బాలాలయం చెరువును తలపిస్తోంది. అర్చకులు వర్షపు నీటిలో కూర్చుని పూజలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షం పడటంతో బాలాలయం మునిగిపోయింది. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తుండటంతో తాత్కాలికంగా బాలాలయంలోనే నిత్య పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.