NTV Telugu Site icon

TS Heavy rains: పెరగనున్న పగటిపూట ఉష్ణోగ్రతలు.. అయినా ఆ రెండ్రోజులు వర్షాలు

Telangana Rains

Telangana Rains

TS Heavy rains: తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఆదివారం చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొంది. నల్గొండలో 36 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే 3.1 డిగ్రీలు, ఖమ్మంలో 34.4 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే 2.2 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నగరంలో ఉష్ణోగ్రత 29.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భారత వాతావరణ శాఖ ప్రకారం, ఈ వేడి వాతావరణం సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుంది.

సాధారణంగా, ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షం లేదా ఉదయం చినుకులు పడతాయి. రాబోయే నాలుగు రోజుల పాటు పొగమంచు వాతావరణం ఉంటుంది. రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రత 31 డిగ్రీల నుంచి 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో 30 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అక్టోబర్ మొదటి వారం వరకు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, తెలంగాణలో అక్టోబర్ 6-12 మధ్య నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకోవచ్చని ఐఎండీ అంచనా వేసింది.

ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి
ఉత్తర అండమాన్ సముద్రంలో వాయుగుండం బలపడి 19న అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి ఏపీలో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది.
TS Heavy rains: పెరగనున్న పగటిపూట ఉష్ణోగ్రతలు.. అయినా ఆ రెండ్రోజులు వర్షాలు

Show comments