Telangana Rains: మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Read also: Kim Jong Un : తన ప్యాలెస్ ను తానే కూల్చుకున్న కిమ్.. ఆశ్చర్యపోతున్న అగ్రరాజ్యాలు
రానున్న నాలుగు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని, అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షం కురిసే సమయంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. ఎన్నికలు జరిగే మే 13న తెలంగాణ, ఏపీలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల నుంచి కనిష్టంగా 24 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
Read also: Tamilnadu Video: కొత్త కారుకి ఆలయంలో పూజలు.. హఠాత్తుగా ఏం జరిగిందంటే..!
పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వరి ధాన్యం తడిసింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట, పారువెల్ల, చొక్కారావుపల్లిలో రైతులు అమ్మకానికి తెచ్చిన వరిధాన్యం తడిసింది. దీనిపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల పిడుగులు పడి మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. మరోవైపు హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. భారీగా వరద నీరు చేరడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Read also: S. Jaishankar: పీఓకే భారత్లో అంతర్భాగం.. త్వరలోనే ప్రజల కోరిక నెరవేరుతుంది..
ట్రాఫిక్ జామ్ ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. ఇప్పుడు మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్టంగా 40 డిగ్రీలు, కనిష్టంగా 21.9 డిగ్రీలు నమోదైంది.
S. Jaishankar: పీఓకే భారత్లో అంతర్భాగం.. త్వరలోనే ప్రజల కోరిక నెరవేరుతుంది..
