Site icon NTV Telugu

Telangana Rain Alert: అలుగుపారుతున్న చెరువులు.. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు

Rain Hyderabad

Rain Hyderabad

భారీ వ‌ర్షాల‌తో తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో చెరువులు అలుగుపారుతున్నాయి. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండ‌టంతో.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనేప‌థ్యంలో.. పలు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరాకు అంతరాయాలు, మరికొన్ని చోట్ల రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయితే.. అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి.

కాగా.. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంటల్లో చిరుజల్లులు పడుతుండగా.. ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, పెద్దఅంబర్‌పేట, తుర్కయంజాల్, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఈనేప‌థ్యంలో.. మహబూబ్‌నగర్​లో రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వరదలో చిక్కుకుపోయింది. అయితే.. మాచన్‌పల్లి- కోడూరు మధ్య అండర్‌బ్రిడ్జిలో చిక్కుకుంది. కాగా.. బస్సులో 25 మంది విద్యార్థులు ఉండగా..​ స్థానికుల సాయంతో డ్రైవర్ పిల్లలను క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు.

read also: Telangana Rain Alert: అలుగుపారుతున్న చెరువులు.. మరో 3రోజుల పాటు భారీ వర్షాలు

నిలిచిన బొగ్గు ఉత్పత్తి..: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తోన్న వర్షంతో భూపాలపల్లి కాకతీయ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షం కారణంగా సుమారు 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు అధికారులు తెలిపారు. ఇల్లందు లోని సింగరేణి జె కే 5 ఓ సి లో (ఓ బి =ఓవర్ బర్డెన్) 6 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయ్యాయి. టేకులపల్లి మండలం కోయగూడెం సింగరేణి ఓసి గనులలో సుమారు 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. వర్షం కారణంగా ఓసి బురదమయంగా మారి వాహనాలు తిరగలేని పరిస్థితి ఉంది. గనులలో నీరు కూడా నిలిచిపోయింది. ఇల్లందు మండలం జెండాలా వాగు పొంగి రాక పోకలు నిలిచి పొయ్యాయి.

మరోవైపు ఇల్లందు పట్టణంలోని అతిపెద్ద ఇల్లందులపాడు చెరువు అలుగు పోస్తోంది. అలుగు ప్రవాహం నీటితో సత్యనారాయణపురం వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ బుగ్గవాగులో కలుస్తుండగా.. ఇల్లందు-సత్యనారాయణపురం మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రాగల మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు .. తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Exit mobile version