NTV Telugu Site icon

Hyderabad Rains : భాగ్యనగరాన్ని వీడనంటున్న వరుణుడు..

Rain In Hyderabad

Rain In Hyderabad

Once Again Heavy Rain in Hyderabad.

తెలంగాణలో గత వారం భారీ వర్షాలు కురియడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అంతేకాకుండా ఎగువన సైతం వర్షాలు సంభవించడంతో జలాశయాలకు భారీ వరద నీరు వచ్చి చేరింది. అయితే.. వరద నీరుల గ్రామాలను ముంచెత్తడంతో ఇప్పటికే పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. అయితే గత రెండు రోజులుగా తెలంగాణలో వర్షాలు విరామం తీసుకున్న తరువాత మళ్లీ నిన్న సాయంత్రం నుంచి వర్షలు మొదలయ్యాయి. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతాల్లో హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం కురిసింది. అలాగ ఈ రోజు మధ్యాహ్నం సమయంలో స్వల్పంగా కురిసిన వర్షం.. సాయంత్రం సమయంలో జోరుగా మారింది. దీంతో హైదరాబాద్‌లో కొన్ని చోట్ల రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. అంతేకాకుండా పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం కలిగింది.

Bhatti Vikramarka : లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే చేయాలి

సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వార్‌, బొల్లారం, జేబీఎస్‌, మారేడ్‌పల్లి, పాట్నీ సెంటర్‌లో వానపడుతున్నది. అలాగే చిలుకలగూడ, గుండపోచంపల్లి, కొంపల్లి, కూకట్‌పల్లి, ప్రగతినగర్‌, నిజాంపేటతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. అయితే నేడు, రేపు ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని బోనాలు జరుగుతున్న నేపథ్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే వర్షం కురుస్తుండటంతో వర్షంలోనే అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు వస్తున్నారు.