Site icon NTV Telugu

Shamshabad: శంషాబాద్ లో భారీగా పట్టబడిన డ్రగ్స్.. 30 మెఫింటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు సీజ్

Shamshabad

Shamshabad

Shamshabad: శంషాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టబడింది. 30 మెఫింటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు సీజ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. నిషేధిత మెఫింటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ లను విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎస్ఓటీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. పహాడిశేరీఫ్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ ఎజాజ్ మొయినుద్దీన్, మహమ్మద్ అక్రమ్ లు నిత్యం జిమ్ చేసే అలవాటు ఉండేది. అయితే తొందరగా కండలు పెరిగి బిల్డర్ గా అయ్యేందుకు మెఫింటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వాడడం ప్రారంబించారు. దీంతో వారి శరీరం తొందరగా బిల్డ్ అయ్యేది. దీంతో వారు సులభంగా డబ్బు సంపాదించేందుకు ఓ పథకం వేశారు.

Read also: King Charles III: బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3కి క్యాన్సర్..

తాము వాడుతున్న మెఫింటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ తెచ్చి మార్కేట్ లో అమ్ముతే డబ్బులు వస్తాయని భావించి అన్ లైన్ ద్వారా 200 ఒక మెఫింటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ తెప్పించేవారు.. వాటిని 1500-2000 వరకు ఒకటి విక్రయిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న శంషాబాద్ ఎస్ఒటి పోలీసులు ఇద్దరు నిందితులు శంషాబాద్ మండలం సంఘిగుడా చౌరస్తా వద్ద మెఫింటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ లు విక్రయిస్తుండగా పట్టుకున్నారు‌ నిందితుల వద్ద 30mg/ml 30మెఫింటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ బాటల్స్, 4 సిరంజిలు , మూడు సెల్ ఫోన్ లు, 27 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మెఫింటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ లు వాడితే అనేక రకల వ్యాది బారిన పడతారని ఎవరు కూడా ఇలాంటి నిషేదిత ఇంజెక్షన్ లు వాడకూడదని పోలీసులు సూచించారు. ఇదరు నిందితులను రిమాండ్ కు తరలించారు.
Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ వద్దకు దూసుకొచ్చిన సర్పంచ్‌లు.. అడ్డుకున్న పోలీసులు

Exit mobile version