Site icon NTV Telugu

Harish Rao : ఆసుపత్రిలో హరీష్‌ రావు సడన్‌ ఎంట్రీ.. ఆ డాక్టర్‌ సస్పెండ్‌..

Harish Rao

Harish Rao

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రిని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు డాక్టర్ మూర్తి డబ్బులు అడిగారని బాధితుల ఫిర్యాదు చేయడంతో.. వివరాలు అడిగి తెలుసుకొని, ఆ డాక్టర్ పై అక్కడిక్కడే మంత్రి హరీష్‌రావు సస్సెండ్‌ చేశారు. ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

గైనకాలజి వార్డులో ప్రతి రోజూ స్కానింగ్ నిర్వహించాలని, అదనంగా రెండు అల్ట్రా సౌండ్ మిషన్లు పంపుతామని మంత్రి హామీ ఇచ్చారు. గైనకాలజి వార్డులో సదుపాయాలను పరిశీలించిన మంత్రి, 60శాతం పైగా సాధారణ డెలివరీలు కావడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా పెంచాలని సూచించారు. ఆసుపత్రిలో తిరుగుతూ.. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని, సదుపాయాలు ఎలా ఉన్నాయి అని పేషెంట్లను మంత్రి హరీష్‌రావు అడిగి తెలుసుకున్నారు.

Exit mobile version