Site icon NTV Telugu

Harish Rao: శ్వేత పత్రం కక్ష సాధింపు లెక్క.. అది తప్పుల తడక

Harish Rao Ts

Harish Rao Ts

Harish Rao: శ్వేత పత్రం కక్ష సాధింపు లెక్క.. వాళ్లకు కన్వినెంట్ గా తయారు చేసుకున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అరగంట అనంతరం అసెంబ్లీ సమావేశం మొదలైంది. దీంతో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపు లెక్క ఉంది ఈ శ్వేత పత్రం అన్నారు. రాష్ట్ర సర్కార్.. శ్వేత పత్రం చూస్తుంటే.. వాస్తవాల వక్రికరణల ఉందన్నారు. తప్పుల తడకగా రాష్ట్ర ప్రభుత్వం వైట్ పేపర్ ఉందని మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని బధనాం చేసే ఆలోచనే కనపడుతుందని అన్నారు. ఆర్థిక స్థితిపై వైట్ పేపర్ ను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తయారు చేయలేదన్నారు. తెలంగాణ గత తొమ్మిదేళ్ళలలో చాలా రంగాల్లో తెలంగాణ మెరుగ్గా ఉందన్నారు. కానీ వైట్ పేపర్ లో ప్రభుత్వం తనకి అనుకూలంగా లెక్కలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాలు ఉన్నాయన్నారు. హౌస్ కమిటీ వేయండని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పై చర్చ చేద్దామన్నారు. ఇవన్నీ సీఎం పాత గురువుకి చెందిన రిటైర్డు అధికారితో రాయించారన్నారు. మాజీ ఐఏఎస్ రిటైర్డ్ అధికారితో రాయించారని తెలిపారు.

Read also: Motorola Offers: మోటోరోలా బంపర్ ఆఫర్‌.. ఆ ఫోన్లపై రూ 10 వేల డిస్కౌంట్‌!

అయితే ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇచ్చిన శ్వేత పత్రలెక్కల్లో తప్పు ఉంటే చెప్పండని కోరారు. కానీ.. ఎవరి పేరులో చెప్పి తప్పుదారి పట్టించొద్దని అన్నారు. రికార్డు నుండి తొలగించాలని కోరారు. దీంతో హరీష్ రావు మాట్లాడుతూ.. వాళ్లకు కన్వినెంట్ గా తయారు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు కొలిచే విధానం ఫాలో కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారని అన్నారు. తెలంగాణ కంటే 22 రాష్ట్రాల్లో అప్పు ఎక్కువ తీసుకున్నాయన్నారు. రాజస్థాన్.. 5.37 లక్షల కోట్లు అప్పు చేసిందని అన్నారు. కర్ణాటక కూడా 5 లక్షల కోట్లు అప్పు చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆస్తుల కల్పన చేశామన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా శ్వేత పత్రం ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో అధ్భుత ప్రగతి సాధించామన్నారు.
Bigg Boss7 Telugu : నాగార్జునను అరెస్టు చేయాలి.. తెలంణాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు..

Exit mobile version