NTV Telugu Site icon

Harish Rao: దేశం మార్పు కోసమే కేసీఆర్ పోరాడుతున్నారు

Harish Rao On Kcr

Harish Rao On Kcr

Harish Rao Speech At CM KCR Cricket Tournament: ఈ దేశంలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే దేశం కోసం సీఎం కేసీఆర్ పోరాడుతున్నారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్ధిపేటలో సీఎం కేసీఆర్ క్రికెట్ టోర్నీ ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ప్రారంభించినప్పుడు ఇది సాధ్యమవుతుందా? అని అనుకున్నారని, ఎట్లైతే గట్లైతదని పోరాడి తెలంగాణ తెచ్చారని అన్నారు. KCRలో K అంటే కారణజన్ముడు, C అంటే చిరస్మనీయుడు, R అంటే మన తలరాతను మార్చిన మహనీయుడు అని అభివర్ణించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే అని విష్ చేశారు. ప్రతిఒక్కరూ కేసీఆర్‌ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

Chandrababu Naidu: రాబోయే రోజుల్లో అసలు బటన్ జనం నొక్కుతారు

ఇక మన దేశ జనాభా 140 కోట్లు ఉండగా.. అందులో కేవలం 11 మంది మాత్రమే క్రికెట్ ఆడుతారని, ఆ 11 మందిలో మన తెలుగుబిడ్డ అంబటి రాయుడు ఒకడని హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేటతో అంబటి రాయుడికి మంచి సంబంధం ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏకరంన్నర భూమి ఇచ్చాడని తెలియజేశారు. ఇదే సమయంలో నేచురల్ స్టార్ నాని గురించి మాట్లాడుతూ.. సినిమాల్లో నాని నేచురల్‌గా నటించి, నేచురల్ స్టార్‌గా ఎదిగారన్నారు. తాను సినిమాలను తక్కువగా చూస్తానని, కానీ నాని నటించిన ‘జెర్సీ’ సినిమా చూశానని చెప్పారు. ఆ సినిమాలో.. గల్లీలో క్రికెట్‌ ఆడుకునే నాని, అంతర్జాతీయ బ్యాటర్‌గా ఎదుగుతాడని, మీరు కూడా జీవితంలో అలాగే ఎదగాలని ప్రజలకు సూచించారు.

Pawan Kalyan: అంబులెన్స్ అడిగితే దిక్కులేదు… రాజధాని అభివృద్ధి చేస్తారట

ఈ ఈవెంట్‌కి అతిథిగా హాజరైన క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ.. తాను సీఎం కేసీఆర్‌కి పెద్ద అభిమానినని తెలిపాడు. సిద్దిపేటకి రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. పదేళ్లలో ఇండియాలో జరగని అభివృద్ధి సిద్ధిపేటలో జరిగిందన్నాడు. ఇండియా టీంలో తెలుగు వాళ్ళు చాలామంది ఆడాలని ఆకాంక్షించాడు. ఈ సందర్భంగా.. సిద్దిపేటలో క్రికెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించాలని అతడు మంత్రి హరీశ్ రావుని కోరాడు.