Harish Rao: సొంత రాష్ట్రాల్లో హామీలు అమలు చెయ్యచేతగాదు కానీ..ఇక్కడ మాత్రం చేస్తామని కల్లి బొల్లి మాటలు చెబుతున్నారని కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్టాల్లో దివ్యంగులకు వెయ్యి రూపాయల పింఛన్ మాత్రమే ఇస్తున్నారని అన్నారు. దివ్యంగులకు 4016 రూపాయల పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లయితే పడని…హామీలు ఎగబెట్టుదాం అని చూస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్ముతే ఎండమావులకు ఆశపడ్డట్టు అవుతుందని అన్నారు. వాళ్ళ సొంత రాష్ట్రాల్లో హామీలు అమలు చెయ్యచేతగాదు కానీ..ఇక్కడ మాత్రం చేస్తామని కల్లి బొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. సిద్దిపేటలో ఏ ఎన్నిక జరిగినా ఏకగ్రీవమేనని సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు మరోసారి నిరూపించారని తెలిపారు.
Read also: SBI Debit Card: ఎస్‌బిఐ ఎటీఎం కార్డు వాడట్లేదా? ఏం జరుగుతుందో తెలుసా?
ఒకవైపు పట్టణ ప్రజలు మరోవైపు పలు గ్రామాల్లో కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మంత్రి హరీశ్ రావుకు, బీఆర్ ఎస్ పార్టీకి జై కొడుతున్నారని తెలిపారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్ కుల సంఘాల నాయకులు మంత్రిని కలిసి అండగా ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు అందించారని అన్నారు. సిద్దిపేట ప్రజల ఆదరాభిమానాలు, అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారని అన్నారు. అంతా కలిసికట్టుగా ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకోవడం బీఆర్‌ఎస్ పార్టీపై వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి అని అన్నారు. ఇవాళ సాయంత్రం సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్లొననున్నారు. సాయంత్రం కోమటి చెరువులో దాదాపు 4500 డ్రోన్లతో డ్రోన్ షో నిర్వహణ కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దిని డ్రోన్ షో ద్వారా తెలిసేలా నిర్వహించనున్నారు.
Top Headlines @1PM : టాప్ న్యూస్