NTV Telugu Site icon

Harish Rao: కేసీఅర్ దగ్గర నేను కార్యకర్త …పార్టీ ఏమి చెబితే అదే చేస్తా

Harish Rao

Harish Rao

Harish Rao: సీఎం కేసీఅర్ దగ్గర నేను కార్యకర్తను పార్టీ ఏమి చెబితే అదే చేస్తా అని మంత్రి హరీష్ రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బషీర్ బాగ్ మీట్ ది ప్రెస్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఇప్పుడు వాటర్ ట్యాంకర్ లు కనపడడం లేదని అన్నారు. పాజిటివ్ ఓటుతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎజెండా లేక విపక్షాలు తిట్ల దండకం అందుకున్నారని మండిపడ్డారు. చెప్పతో కొట్టాలి అని ఒక విపక్ష నాయకుడు అన్నారు… నేను కూడా బూటు తో కొట్టాలి అని అనవచ్చంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ , బీజేపీ ఒక్కటి అయ్యాయని తెలిపారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే సుస్థిర పాలన.. కాంగ్రెస్ కు ఓటు వేస్తే సంక్షోభ పాలన అన్నారు. బీఆర్ఎస్, బీజేపి ఒక్కటి అయితే గవర్నర్ మా బిల్లులు ఎందుకు అపుతున్నరు? అని ప్రశ్నించారు. గవర్నర్ రాష్ట్ర సర్కార్ ను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. RTC విలీన బిల్లును గవర్నర్ అమొదించకుండా ఆలస్యం చేశారని అన్నారు. కేసీఅర్ దగ్గర నేను కార్యకర్త.. పార్టీ ఏమి చెబితే అదే చేస్తా అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పాజిటివ్ ఓటింగ్ తో పాటు ప్రతికూలతలు ఉంటాయని తెలిపారు.

మళ్ళీ అధికారంలోకి వస్తే విద్య ,ఆరోగ్యరంగంతొ పాటు హైదరాబాద్ నగర అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. గుంట కరెంట్ లేక ఎండి పోయిందా ? కాంగ్రెస్ నేతలను చెప్పమనండి? అని ప్రశ్నించారు హరీష్ రావు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం.. అప్పుల విషయంలో నియంత్రణలో ఉన్నామన్నారు. ప్రతి నెల 1 నుంచి 5 వరకు ప్రభుత్వం జీతాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ ను L అండ్ T పునరుద్ధరిస్తుందన్నారు. విపక్షాలు మేడిగడ్డ విషయంలో కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నా పై రెండు వందల కేసులు ఉన్నాయన్నారు. నా తెలంగాణ ఉద్యమ ఇంటిగ్రిటి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడే నైతికత లేదన్నారు. డబ్బు ఖర్చు మంచిది కాదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెట్టుబడిదారులు వచ్చి డబ్బు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో డబ్బు రాజకీయాలు మంచిది కాదని మంత్రి తెలిపారు.
MLA Laxmareddy: మాయమాటలు చెప్పే కాంగ్రెస్ మాకు వద్దు.. లక్ష్మన్నతోనే గ్రామ అభివృద్ధి