Minister Harish Rao countered CLP leader Bhatti's remarks at the 2022 Telangana Assembly budget meetings.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మాటల యుద్ధం నడుస్తోంది. అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పాటు, పలు విషయాలపై అధికార పార్టీకి ప్రశ్నలు సంధించారు. దీనిపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. భట్టి రాజకీయ విమర్శలు తప్పితే
బడ్జెట్ మీద అవగాహనతో సూచన చేస్తారు అనుకున్న కానీ.. సూచనలు లేవు.. రాజకీయ విమర్శలే చేశారని ఆయన అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా 80 వేల ఉద్యోగాలు ఒకే రోజు ప్రకటన రాలేదని, కాంగ్రెస్..బీజేపీ కి భేజార్ అయ్యారని, నిరుద్యోగులు అంతా ఆనందంగా ఉన్నారని ఆయన అన్నారు. గాంధీ పేరు తో ఏండ్లు రాజకీయం చేస్తున్నారని, కానీ గ్రామ స్వరాజ్యం మాత్రం పట్టించుకోరంటూ ఆయన విమర్శలు గుప్పించారు. చెట్టుపెరు చెప్పి కాయలు అమ్ముకునుడు కాదు అంటూ ఆయన ధ్వజమెత్తారు.
