NTV Telugu Site icon

Harish Rao: 7,200 మంది మత్స్యకారులకు గుర్తింపు కార్డులు.. పంపిణీ చేసిన హరీష్‌ రావు

Minister Harish Rao

Minister Harish Rao

Harish Rao: తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. వచ్చే ఎన్నికల్లో విజేతలకు, అబద్ధాలకు మధ్య పోటీ ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఘాటుగా విమర్శించారు. గతంలో మత్స్యకారులు సభ్యత్వం పొందడం కష్టతరంగా ఉండేది. కానీ, ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఆదివారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు చెందిన 7,200 మంది మత్స్యకారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన సందర్భంగా సహచర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల గంగపుత్రులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల సంక్షేమానికి 2000 కోట్ల రూపాయలు వెచ్చించిన ఏకైక నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ హయాంలో కొన్ని చెరువుల్లో సబ్సిడీపై చేప పిల్లలను పెంచేవారని, నేడు రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో 100% సబ్సిడీతో ఉచితంగా అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

సిద్దిపేట నుంచి విజయవాడ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కు చేపలు ఎగుమతి కావడమే గర్వకారణం. తప్పుడు ప్రకటనలు చేసే కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మరు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం అని తెలంగాణ ప్రజలు ఆత్మఘోష పెట్టారని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఏఐసీసీ సమావేశం. అసత్యాలు చెప్పడం మొదలు పెడతారని, 60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కౌరవులు ఎక్కడా గెలవరు. ధర్మాన్ని అనుసరించే పాండవులు గెలుస్తారు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని కురుక్షేత్రంలో ధర్మం గెలుస్తుంది. కాంగ్రెస్ కౌరవుల పార్టీ. అభివృద్ధిని గెలిపించడమా.? అబద్ధం గెలవాలా? మధ్య పోటీ నెలకొంది. ఎన్నో అద్భుత విజయాలు సాధించిన తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి అని మంత్రి హరీశ్ రావు అన్నారు. అభివృద్ధి చెందిన పార్టీని మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

మంచి నాయకుడు హరీశ్ రావు సిద్దిపేటలో ఉండడం అదృష్టంగా భావించాలని మంత్రి తలసాని అన్నారు. అందరూ సిద్దిపేట చూసి నేర్చుకుంటారు. ఇక్కడికి వచ్చాక కొత్తదనం నేర్చుకుంటానని చెప్పారు. ఏ శాఖ ఇచ్చినా పూర్తి న్యాయం చేస్తానని అన్నకు హరీష్ కొనియాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా చేపలు, రొయ్యలు, గొర్రెలు ఉచితంగా పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్ అని మంత్రి తలసాని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపించి అభివృద్ధి ఆగిపోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంత్రులతో పాటు ఎంపీ కోట ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్య, రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సమాఖ్య వైస్‌ చైర్మన్‌ డీటీ మలయ్య, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.
Bandaru Dattatreya Daughter: ఎన్నికల బరిలో దత్తాత్రేయ కుమార్తె.. ముషీరాబాద్ అభ్యర్థిగా విజయ లక్ష్మి దరఖాస్తు