NTV Telugu Site icon

Loan App Harassment: లోన్ యాప్ వేధింపులు.. కానిస్టేబుల్ మృతి..!

Loan App Harassment

Loan App Harassment

లోన్ ఆప్స్ నిర్వాకుల ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నాయి. అందరికీ ధైర్యం చెప్పాల్సిన పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులో కలకలం సృష్టిస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుధాకర్ ని లోన్ నిర్వాహకులు విపరీతంగా వేధించారు. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో భార్య ఫోటోలని మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోలుగా తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ కానిస్టేబుల్ కి లో నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడ్డారు. లోన్ నిర్వాహకులు చేసిన బెదిరింపులతో భయపడుతున్న కానిస్టేబుల్ ఏకంగా సూసైడ్ పాల్పడ్డాడు.

జల్‌పల్లికి చెందిన యంజాల సుధాకర్‌ చందులాల్‌ బారదరి ఫైర్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.ఆయనకు భార్య మాధవి, కూతురు ఉన్నారు. అయితే, గోల్డెన్‌ రూపీ అనే లోన్ యాప్‌ నుంచి ఆరు వేలు రుణాన్ని సుధాకర్‌ తీసుకున్నాడు. కానీ.. దాన్ని సకాలంలో చెల్లించలేకపోయారు. దీంతో ఆయాప్‌ ఏజెంట్ల నుంచి వేధింపులకు ఎక్కువయ్యాయి. ఎన్నిసార్లు బాకీ సొమ్ము చెల్లించినా.. ఇంకా రుణం వుందంటూ ఫోన్ చేసి చిత్ర హింసలకు గురి చేశారు. అసభ్య పదజాలంతో ఫోన్‌కు మెసేజ్‌లు పెట్టి మానసికంగా హింసించేవారు. నీ మీ భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోలు తయారుచేసి సోషల్ మీడియాతో పాటుగా బంధుమిత్రులుకు పంపిస్తామంటూ హెచ్చరించారు. అంతేకాక, సుధాకర్‌ ఓ మోసగాడు అని కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న పలువురికి మెసేజ్‌లు పెట్టారు. సుధాకర్ ఫోటో మీద చీటర్ అనే ముద్ర వేసి ఫోటోలని సోషల్ మీడియాతో పాటు మిత్రులకు పంపించారు. వీటన్నింటినీ మనస్తాపం చెంది సుధాకర్‌ ఇటీవల సన్నిహతుల వద్ద చెప్పుకున్నాడు. మనస్తాపానికి గురైనా సుధాకర్ మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటకెళ్లిన అన్న కుమార్‌కు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా నిర్ణయం చెప్పారు. శివరాంపల్లి – శాస్త్రీపురం మార్గంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుధాకర్ దగ్గర దొరికిన ఫోటో ఐడెంటికాలను గుర్తించి రైల్వే పోలీసులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మెరకు కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై గోల్డ్ రుపీ లోన్ యప్ పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

లోన్ అప్ నిర్వాకులు పెట్టే వేధింపులకు ఎవరు ఆందోళన చెందవద్దని, అలాంటి వేధింపులకు గురిచేస్తున్న వారికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాకు తెలియజేయాలని పోలీసులు సూచిస్తున్నా పోలీసు అధికారే భయపడి ప్రాణాలు తీసుకోవడంపై సర్వత్రా ఉత్కంఠంగా మారింది. దీనిపై పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. లోన్ యాప్ వేధింపులు లోనుకావద్దను ఒక వేల ఆలాంటి ఫోన్ కాల్స్ వస్తే పోలీసులకు తెలపాలని సూచించారు. వారు విధించినంతమాత్రాన విలువైన ప్రాణాలు తీసుకుని కుటుంబానికి దూరం కావద్దని పేర్కొన్నారు.