NTV Telugu Site icon

Harassment: నీటి సంపులో బాలుడు.. అత్తింటి వారిపై కేసుపెట్టిన కోడలు

Harassment

Harassment

Harassment: హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అత్తింటి వారి వేధింపులు, కుటుంబ కలహాలతో ఆ బాలుడు బలయ్యాడు. అప్పటివరకు తన దగ్గరే వున్న తన కుమారుడు విగత జీవిగా మిగిలడంతో గుండెలు పగిలేలా ఏడ్చింది ఆ తల్లి. ఈ ఘటన హైదరాబాద్ రామంతాపూర్ లో చోటుచేసుకుంది. రామంతాపూర్‌ గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన సనాబేగానికి భర్త, రెండు నెలల కుమారుడు ఉన్నాడు. అత్తమామలు అబ్దుల్‌ బాబు, ఖుమర్‌ బేగంతో పాటు ఆడపడుచు, మరుదులు వారి సంతానం మొత్తం దాదాపుగా పది మందితో అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈనెల 19న రాత్రి ఆమె భర్త ఉద్యోగ రీత్యా బయటికి వెళ్లడంతో సనాబేగం తన రెండు నెలల కుమారుడు అబ్ధుల్‌ రహమాన్‌.. అత్త, ఆడపడచూ ఫౌజియా బేగం, అడపడుచు కుమార్తెతో కలిసి ఒకే గదిలో నిద్రించారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత తన కుమారుడు కనిపించక పోవడంతో ఆందోళనకు గురైన సనాబేగం చిన్నారి కోసం ఇంటి పరిసరాల్లో గాలించింది. కుమారుడు ఏమయ్యాడో అంటూ తల్లడిల్లింది.

read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇంట్లో వున్నవారందరికి చెప్పింది. ఎక్కడ వెతికినా కనిపించలేదు కుమారుడు. ఎక్కడా ఆచూకీ దొరకక పోవడంతో అనుమానంతో నీటి సంపులో వెతకగా అందులో కనిపించాడు. దీంతో బాలుడిని వెలికి తీసి చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్‌ అసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తల్లి సనాబేగం కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల బాలుడు అంత అర్థరాత్రి తల్లి దగ్గర నుంచి ఎవరు తీసుకు వెళ్లారు? అయినా రెండు నెలల బాలుడు నడుచుకుంటూ వచ్చేంత ఆస్కారం లేదు? అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోపం ఉంటే కోడలిపై చూపకుండా చిన్నరిపై ఎందుకు కరక్కసంగా చూపించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లి గుండెపగిలేలా ఏడ్చింది. గుండెలకు హత్తుకుని కన్నీరుమున్నీరైంది. అప్పటివరకు తన వద్దే వున్న కుమారుడు విగత జీవిగా మిగలడంతో తల్లడిల్లింది.
Rana Daggubati: తండ్రి కాబోతున్న రానా.. క్లారిటీ ఇచ్చిన హీరో