Warangal Farmers News: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులు రుణాల రెన్యువల్ కోసం బ్యాంకుల క్యూ కడుతున్నారు. పరకాల, నడికూడతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, రేగొండ మండలాలకు చెందిన రైతులు మొదటి, రెండో విడతల్లో రుణమాఫీ వర్తించిన అన్నదాతలు తాము తీసుకున్న పంటరుణాలు రెన్యువల్ చేసుకోవడం కోసం బ్యాంక్ ల ముందు పడిగాపులు కాస్తున్నారు.. రెగ్యులర్గా రెన్యువల్ చేసుకుంటున్న రైతులకు 5 నిమిషాల్లోనే రుణాన్ని తిరిగి ఇస్తుండగా.. రెండు మూడేళ్ల నుంచి రెన్యువల్ చేయించుకోని వారికి తిరిగి కొత్తగా పంటరుణం ఇవ్వడానికి వారం, పది రోజుల గడువు విధిస్తున్నారు. రుణల రెన్యువల్ కోసం రైతులు రుణమాపీ పొందిన మొత్తం కంటే అధిక అప్పులున్న వారి నుంచి రుణ మాజీ జరిగిన డబ్బులు తీసేసి మిగిలిన డబ్బులను కటించుకుంటున్నారు బ్యాంక్ అధికారులు.
Read also: Shamshabad Crime: దారుణం.. కారు ప్రమాదంలో తెగిపడ్డ తల..
ఈ నేపథ్యంలో రుణాల రెన్యువల్ కోసం బ్యాంకులకు రైతుల తాకిడి పెరిగిపోయింది. ఒక్కసారిగా రుణాల చెల్లింపులు. రెన్యువల్ చేసుకునేందుకు వస్తున్న రైతుల తాకిడి పెరగడంతో చేసేదిలేక బ్యాంకు అధికారులు రోజూ ఉదయం 10 గంటలకు 150 నుంచి 200 మందికి టోకెన్లు ఇస్తున్నారు.దీంతో వాటిని పొందేందుకు తెల్లవారు జామునే రైతులు బ్యాంక్ ల ముందు క్యూ కడుతున్నారు. బ్యాంకు తెరిచే సమయానికి వస్తే టోకెన్లు అందుకునేడుకు తెల్లవారు జామునే బ్యాంకు దగ్గరకు వచ్చి క్యూ కడుతున్నారు. అయితే బ్యాంకుల్లో ఋణ మాఫీ లావాదేవీలకు ఎలాంటి గడువు లేదనీ. రైతులు ఆపోహలకు గురికావద్దని, బ్యాంకు వద్ద రాత్రివేళ నిద్రించాల్సిన అవసరం లేదని నిదానంగా రెన్యువల్ చేసుకోవచ్చని బ్యాంక్ అధికారులు సూచించారు.
CM Revanth Reddy: ఆయన పాట ప్రజా యుద్ధ నౌక.. గద్దర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నసీఎం..