NTV Telugu Site icon

Ponnam Prabhakar: రైతు రుణమాఫీ రాని వారి వివరాలు సేకరిస్తున్నాం..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: రైతు రుణమాఫీ రాని వారి వివరాలు సేకరిస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనురులో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బాగుండద్దు తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఏమైనా చేస్తే బిఆరెస్ నేతలకు కళ్ళ మంట లాగ కనిపిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వ్యక్తిగత పర్యటన కాదు.. అధికారిక పర్యటన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తో పాటు ఫైనాన్స్ సెక్రటరీ, ఐటీ, పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో పాటుగా అమెరికా వెళ్లి డెలిగేశన్స్ నీ కలుస్తున్నారు. రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుందో అని కల్ల మంటతో అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. మేము సవాలు చేస్తున్నాం. 10 సంవత్సరాలుగా ఫాం హౌస్ నుండి కనీసం సెక్రటేరియట్ కి రాని ముఖ్యమంత్రి 10 ఏళ్లు ఉంటే ఈరోజు దేశ ఎల్లలు దాటి తెలంగాణ ప్రజల బాగు కోసం ప్రజా పాలన పేరు మీద బాగు చేయాలని ఆలోచనతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్న తీరును ప్రజలు ఆలోచన చేయాలి.

Read also: US: మత్స్యకారుడికి అరుదైన ఎండ్రకాయ లభ్యం..ఇది 10 కోట్ల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపిస్తుంది

ప్రభుత్వ పర్యటనలో తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక అంశాలు ముందడుగు పడుతుంటే కుటుంబపరమైన అంశాలు ప్రస్తావిస్తూ దానిని చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ అనేక సందర్భాల్లో విదేశీ పర్యటనలు చేశారు. గత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏనాడూ నిధులు తీసుకురావాలనే ఆలోచన చేయలేదు. వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఆరోపణలు చేస్తున్నారు..మంచిది కాదు.. బీఆర్ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నమస్తే తెలంగాణ పేపర్ లో నిలువునా విరిగిపడ్డ సుంకి శాల కోడ కూలీ తృటిలో తప్పిన పెను ప్రమాదం అంటున్నారు. ఈ పని జరిగింది బీఆర్ఎస్ హయంలో దీనికి సంబంధించిన కారణాలపై విచారణకు అదేశిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు హైదారాబాద్ ఇంచార్జి మంత్రిగా నీళ్ళు హైదారాబాద్ కి తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా మున్సిపల్, hmda, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను పూర్తిగా విచారణకు అదేశిస్తున్నాం.

Read also: Tollywood: టుడే టాలీవుడ్ టాప్ న్యూస్.. జస్ట్ ఒక క్లిక్ తోనే..

దీనికి కారణం పూర్తిగా దోషి బీఆర్ఎస్. మీరు విచారణకు సిద్ధమా…?ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదు .. బీఆర్ఎస్ తప్పులను ప్రజల ముందు చూపెడతామన్నారు. మసిపూసి బట్ట కాల్చి మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.మొన్ననే కాళేశ్వరం కి సంబంధించి లోప భూయిస్ట నిర్ణయాలతో తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది. రైతు వేధికల్లో రైతులు చెబుతున్నారు .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులకు వచ్చిన ప్రయోజనాలు గత 10 ఏళ్లలో రాలేదంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత బాగవుతుందనుకున్నం .అంత హీనంగా జరిగిందని రైతులే స్వయంగా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తూ ఒకటో తారీఖు జీతాలు ఇస్తూ ,రుణమాఫీ చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వం అన్ని రకాల విచారణలు చేయడానికి సిద్ధంగా ఉంది.

Read also: Himachal Pradesh : హిమాచల్ లో క్లౌడ్ బరస్ట్.. వరదల కారణంగా 13మంది మృతి, 109రోడ్లు బంద్

సుంకీ శాల పై కూడా విచారణకు ఆదేశిస్తున్నం..సమగ్రమైన రిపోర్ట్ తెప్పించ్చుకొని ఆనాడు బిఆరెస్ హయంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో కఠిన చర్యలు తీసుకుంటాం. సాంకేతిక పరమైన నివేదికలతో మీ ముందుకు వస్తాం. ప్రాథమిక రిపోర్ట్ రాగానే తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం. బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ లో పడి అసెంబ్లీ లో సోషల్ మీడియా లో గిరిజన మహిళా అని చూడకుండా సోషల్ మీడియా లో పోస్ట్ లు చేశారు. అసందర్భమైన ఆరోపణలతో శాసన సభ లో సరైన విధంగా జవాబులు చెప్పలేక. స్పీకర్ దళితుడు అని దొర తనంతో అధ్యక్ష అని పిలువలేక శాసన సభకు రాలేకపోయారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో గ్యారంటీ స్కీమ్స్ అమలు కానీ 200 యూనిట్ల లబ్ధి జరగని వారిని,500 గ్యాస్ రాని వారిని కరెక్షన్ చేసుకొమ్మని చెప్తున్నాం. రైతు రుణమాఫీ రాని వారి వివరాలు సేకరిస్తున్నాం. ఒక భీమదేవరపల్లి మండలంలో 21 కోట్లు రైతు రుణమాఫీ వచ్చింది. 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడే రుణమాఫీ అమలు చేశామని తెలిపారు.

Read also: Andhra Pradesh: పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజు కిడ్నాప్!

పార్లమెంట్ లో సున్నా సీట్లు ఇచ్చిన తర్వాత వారి ఆసహనానికి హద్దు లేకుండా పోయిందన్నారు. ప్రజ సమస్యల పై మాట్లాడాలని జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మీరు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దోషులను శిక్షిస్తం.. బరబార్ జవాబు చెప్తాం. రుణమాఫీ కాని వారిని నిలదీయాలని కిషన్ రెడ్డి చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు.. ప్రజలు మిమ్మల్ని వేరు వేరుగా చూడలేదు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగితే మాట్లాడ చేతకాని మంత్రి వి అన్నారు. రైతులకు అన్యాయం జరిగింది అంటున్నావు… మీది బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తున్నావ్ రైతులకు రుణమాఫీ రాకపోతే వ్యవసాయ అధికార దగ్గర వివరాలు ఇవ్వాలని చెప్తున్నాం. రైతులకు న్యాయంగా ఉంది అన్యాయం జరిగితే ఆ సమస్యల పరిష్కరించే బాధ్యత మాది. ప్రజా పాలన ద్వారా నడుస్తున్న ఈ ప్రభుత్వం ది. కేసీఆర్ మాటలు మీ రూపంలో చెప్పుకునే ప్రయత్నం మానుకోవాలని కిషన్ రెడ్డిపై మండిపడ్డారు.
Rajya Sabha: రాజ్యసభలో వినేష్ ఫోగట్ నిష్క్రమణపై దుమారం..కుర్చీని వదిలి వెళ్లిపోయిన ఛైర్మన్ జగదీప్

Show comments