Variety haldi function: సోషల్ మీడియాలో వైరల్ కావాలనో, ఒక్క రోజులో పాపులర్ అయిపోవాలనో తెలియదు కానీ కొందరు అయితే మరీ దిగజారిపోతున్నారు. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇలాంటి చేష్టలు చేసి పాపులారిటీ ఏమో గానీ.. తీవ్ర విమర్శలకు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆచారాలతో పాటించాల్సిన పెళ్లిని అపహాస్యం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఇలాంటి వారి వల్లే ఆచారాలన్నీ సంకనాకుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెరైటీ ఇలా చేస్తారా? అంటూ ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఓహల్దీ ఫంక్షన్ లో వరుడు తలపై బీర్ తో స్నానం చేయించిన తీరుపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. పవిత్ర మైన పసుపు నీటితో వరుడు, వధువు తలపై స్నానం చేయించాల్సింది పోయి ఇలా బీర్ తో చేయించడం ఏంటని విమర్శిస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా తాడుర్ మండలం ఐతోల్ గ్రామంలో జరిగిన ఓ హల్దీ కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే సమయంలో దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సాధారణంగా మంగళస్నానం పసుపు నీటితో చేస్తారు. కానీ, ఇక్కడ ఇద్దరూ కలిసి బీరుతో వరుడుకి మంగళ స్నానం చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెరైటీ, పాపులారిటీ కోసం ఈవిధంగా చేసినట్లు తెలుస్తుంది. ఇది వెరైటీ గా చేయడం బాగానే ఉంది కానీ దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేద మంత్రాలతో రెండు కుటుంబాలను, రెండు మనసులను కలిపే వందేళ్ల జీవితానికి వేదికగా నిలిచే ఈ పెళ్లి వేడుక రోజురోజుకూ కొత్త పోకడలకు దారితీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మరికొందరు బీరు తాగిచ్చు కదా బాసూ ఎందుకు ఓవర్ చేస్తున్నారు అంటూ ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. వేసవిలో బీరువాతో స్నానం చేయడం చల్లగా ఉండదని మరొకరు వ్యాఖ్యానించారు. మరి కొందరైతే రేయ్ మీరు మనసులేనా ఇలా ఆచారాలను సర్వనాశనం చేయాలంటే మీలాంటి తాగుబోతులతోనే సాధ్యమంటూ మండిపడుతున్నారు. పెళ్లి అనేది చాలా పవిత్రమైన, సంప్రదాయమైన వ్యవహారం అని , వివాహ వేడుకలో మంగళస్నానం అత్యంత పవిత్రమైన కార్యక్రమం అని పెద్దలు చెబుతున్నారు. బీరుతో కూడిన మంగళస్నానం సంప్రదాయానికి విరుద్ధమని చెప్పబడింది. ఇలా చేయడం అపవిత్రమని అంటున్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించవద్దని సూచిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ స్టేటస్‌ల కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం మన సంప్రదాయాన్ని అవమానించినట్లేనని అభిప్రాయపడుతున్నారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్