NTV Telugu Site icon

Telangana High Court: సస్పెండ్ చేసే అధికారం మంత్రికి లేదు.. మాజీ OSD హరికృష్ణకు హైకోర్టులో ఊరట

Telangana High Court

Telangana High Court

Telangana High Court: హైదరాబాద్‌లోని హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్‌డీ హరికృష్ణకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో హరికృష్ణ సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. తన సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ హరికృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు సస్పెండ్ చేసే అధికారం మంత్రికి లేదని తేల్చి చెప్పింది. అలాగే కమిటీ విచారణలో ఆరోపణలు రుజువు కాకపోవడంతో హరికృష్ణ సస్పెన్షన్‌ను హైకోర్టు ఎత్తివేసింది. హరికృష్ణపై వచ్చిన లైంగిక వేధింపులలో వాస్తవం లేదని తెలిపింది. మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన సస్పెన్స్ ని హైకోర్టు ఎత్తివేసింది. తమను తండ్రిలా చూసుకుంటారని గతంలో మీడియా ముందు కు పాఠశాల విద్యార్థులు చెప్పిన విషయం తెలిసిందే.. అయితే.. హరికృష్ణ ఎదుగుదల చూసి ఓర్వలేక, కుట్రపుర్వకంగా ఇరికించే ప్రయత్నం చేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుతో మాజీ OSD హరికృష్ణ భారీ ఊరట లభించింది.

Read also: Chiranjeevi: లాస్ ఏంజిల్స్‌లో ‘మెగాస్టార్’ చిరంజీవికి ఘన సన్మానం!

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో ఓఎస్డీ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై తొలుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ట్విట్టర్ లో కోరారు. వెంటనే స్పందించిన మంత్రి.. తన నివాసంలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, హరికృష్ణ స్థానంలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఇంచార్జి ఓఎస్డీగా హైదరాబాద్ జిల్లా క్రీడా అధికారిగా పనిచేస్తున్న సుధాకర్ నియమితులయ్యారు.

Read also: Andhra Pradesh: జగన్ పాలనపై రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు.. హాజరైన వాసిరెడ్డి పద్మ, లక్ష్మీ పార్వతి

లైంగిక వేధింపుల ఆరోపణలను స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణ ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. క్రీడా పాఠశాల ప్రతిష్టను దెబ్బతీసేలా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను విచారణను ఎదుర్కొంటానని… తాను ఏ తప్పూ చేయలేదని అందుకే తనకు భయం లేదన్నారు. విచారణ తర్వాత వాస్తవాలు అందరికీ తెలుస్తాయని అన్నారు. హరికృష్ణ తప్పు చేసినట్లు రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. అయితే.. విచారణ అనంతరం సస్పెండ్ చేస్తే బాగుంటుందని.. ఆరోపణలు అవాస్తవమని తేలితే నష్టాన్ని ఎవరు పూడ్చాలని ప్రశ్నించారు. తమ కుటుంబం పరువు పోయిందని హరికృష్ణ దంపతులు వాపోయారు. ఓఎస్డీ పదవి పోయిందని హరికృష్ణ స్పోర్ట్స్ స్కూల్ నుంచి బయటకు వస్తుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. కొందరు విద్యార్థులు ఆయన కారును అడ్డుకున్నారు. తమను విడిచిపెట్టవద్దని రోదించారు. హరికృష్ణ తమకు తండ్రిలాంటి వారని పలువురు విద్యార్థులు తెలిపారు.
Ranchi Test: కేఎల్ రాహుల్‌ జట్టులోకి వస్తే.. అతడిపై వేటు తప్పదు!