NTV Telugu Site icon

దమ్ముంటే తెలంగాణ బీజేపీ నేతలు ఆ విషయం మీద మాట్లాడాలి !

తెలంగాణ ప్రభుత్వం ,ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన విమర్శలు చేసే నాయకులు ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గతంలో పాలన ఎలా ఉండేదో గుర్తుకు ఎరిగి మాట్లాడితే మంచిదన్న ఆయన కేంద్రం నిధులు ఇస్తే పేర్లు మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటుంది అని విమర్శలు చేస్తున్నారు. వాస్తవం తెలుసుకొని మాట్లాడితే ప్రజలు ఆ నాయకులకు గౌరవం దక్కుతుందని అన్నారు. కేంద్ర పథకాలు మేము కాపీ కొట్టడం లేదు .మన రాష్ట్ర ప్రభుత్వ పథకాలనే కేంద్రం కాపీ కొట్టిందని అన్నారు. మన రైతు బంధు పథకం కాపీ కొట్టి మోడీ గారు దేశంలో అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంను కేంద్రం తుంగలో తొక్కిందని, అన్యాయంగా మన రాష్ట్రానికి చెందిన సీలేరు ప్రాజెక్టు, 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం కలిపిందని అన్నారు.

దమ్ముంటే తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయం పైన మాట్లాడాలని ఆయన అన్నారు. ఇంకా కొందరు నేతలు అయితే కేసీఆర్ గారిని అగౌరవంగా, నీచంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.వారి వల్ల సభ్యసమాజం సిగ్గు పడుతుందని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికారంలోకి రాలేని,అసలు రావడానికి అవకాశం లేని పార్టీలకు ఓటు వేస్తే ఆ ఓటు మురిగినట్టేనని ఆయన అన్నారు. అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయి.ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి వస్తాను అంటే ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి ?  రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి అధికార దుర్వినియోగంగా మాట్లాడుతున్నాను అని కొందరు నాయకులు నాపై ఆరోపణలు చేస్తున్నారని అది సరి కాదని అన్నారు.