Site icon NTV Telugu

Gutta Sukender Reddy : ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు

Former Legislative Council Chairman Gutta Sukendar Reddy made Nomination.

శాసన మండలి సభ్యులు, మాజీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు ఉదయం 10.40 నిమిషాలకు శాసన సభ సచివాలయంలోని సెక్రెటరీ ఛాంబర్ లో శాసన మండలి ఛైర్మన్ పదవి కొరకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ,సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఏం ఎస్ ప్రభాకర్ రావు,విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు భాను ప్రసాద రావు,దామోదర్ రెడ్డి,గంగాధర్ గౌడ్,ఎగ్గే మల్లేశం,రఘోత్తమ రెడ్డి,జనార్దన్ రెడ్డి,దండే విఠల్, నవీన్ కుమార్,బస్వరాజ్ సారయ్య,బండ ప్రకాష్, శేరి శుభాష్ రెడ్డి,కడియం శ్రీహరి,ఎమ్మెల్యేలు భాస్కర్ రావు,భూపాల్ రెడ్డి,జీవన్ రెడ్డి,మెతుకు ఆనంద్,మల్లయ్య యాదవ్,ఏం పి బడుగుల లింగయ్య యాదవ్,రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రెండో సారి శాసన పరిషత్ చైర్మన్‌గా నామినేషన్‌ వేశాను.. రెండోసారి ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. గతంలో 21 నెలలు చైర్మన్ గా చేశాను.. అందర్ని సమాన దృష్టితో చూస్తానని నాకు మళ్లీ అవకాశం ఇచ్చారని ఆయన వెల్లడించారు.

https://ntvtelugu.com/mahesh-kumar-goud-about-sarvodaya-padayatra/
Exit mobile version