యాదాద్రి భువనగిరి జిల్లాలోని గుండాల మండల తహసీల్దార్ దయాకర్ రెడ్డి ఓ మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. గత నాలుగు నెలలుగా ప్రతిరోజూ రాత్రిపూట ఫోన్ చేసి వేధిస్తున్నాడు. దీంతో బాధిత మహిళ ఈనెల 8న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
Read Also: జగన్ పాలన అద్భుతం.. మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది: నటుడు అలీ
తహసీల్దార్ దయాకర్‌రెడ్డి నిజంగానే మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని వాళ్లు నివేదిక ఇచ్చారు. దీంతో అధికారులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తహసీల్దార్ దయాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్‌ను చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అక్విజేషన్ (సీసీఎల్ఏ) హైదరాబాద్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.