NTV Telugu Site icon

Firing in Madhapur: రియల్ ఎస్టేట్ వివాదమే కాల్పులకు కారణం..బాలనగర్ డీసీపీ సందీప్ క్లారీటీ

Firing In Madhapur

Firing In Madhapur

హైదరాబాద్ తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. మాదాపూర్ కాల్పులు కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తాడ్ బన్ లోని 250 గజాల ల్యాండ్ తోనే వివాదం చెలరేగడంతో.. ఇస్మాయిల్ కొన్నాళ్ల క్రితమే మమ్మద్ ముజాయుద్దీ పేరు గిఫ్ట్ డిడ్ చేసాడు. స్థల వివాదం పరిష్కారం కోసం మహమ్మద్ ముజాహిదీన్ మాదాపూర్ కి ఇస్మాయిల్ ను పిలిపించారు. ఇస్మాయిల్ , ముజి మాట్లాడుకుంటున్న సమయంలో జిలానీ ఫైర్ ఓపెన్ చేసాడు. మహమ్మద్ ముజాహిద్దీన్ రైట్ యాండ్ గా ఉన్న జిలానీ, ఇస్మాయిల్ పై కంట్రిమేడ్ వెపన్ తో ఆరు రౌండ్లు కాల్పులు చేసాడు. మృతుడు ఇస్మాయిల్, నిందితుడు ముజాహిద్దీన్ పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు.

read also: Firing in Madhapur: రియల్ ఎస్టేట్ వివాదమే కాల్పులకు కారణం..బాలనగర్ డీసీపీ సందీప్ క్లారీటీ

ఈ సంఘటనపై పూర్తీ వివరాలు.. బాలనగర్ డీసీపీ సందీప్ రావు మాట్లాడుతూ.. మాదాపూర్ పీఎస్ పరిధిలో ఇస్మాయిల్ వ్యక్తి పై నీరుస్ జంక్షన్ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్ పై జిలానీ కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఇస్మాయిల్ తో మమ్మద్ ముజాహిద్ మాట్లాడుతుండగా జిలానీ కాల్పులు జరిపారని తెలిపారు. ఇస్మాయిల్ తో మమ్మద్ ముజాహిద్ మధ్య ల్యాండ్ వివాదం ఉందని, దీంతో మాట్లాడుతుండగా గొడవ తలెత్తిందని వివరించారు. కంట్రీ మెయిడ్ వెపన్ తో మూడు రౌండ్ లు కాల్పులు జరిపారని, సాయంత్రం నుండి వీరికి ఉన్న ల్యాండ్ వివాదం పై చర్చలు జరుపుతున్నారని అన్నారు. మాసబ్ ట్యాంక్ , పంజాగుట్ట, జూబ్లీహిల్స్ నుండి మాదాపూర్ వచ్చారని, మధ్య రాత్రికి మాదాపూర్ కి చేరుకున్నారని, రెండున్నర గంటల పాటు ఇద్దరి మధ్య మాట్లాడుకున్నారని పేర్కొన్నారు.

తెల్లవారు జామున నాలుగు గంటలకు జిలానీ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డారని వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వివాదమే కాల్పులకు కారణమని తెలిపారు. సంగారెడ్డిలో వీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారని గుర్తించామన్నారు. పథకం ప్రకారమే కాల్పులు జరిపారా అనేది తెలియాల్సి ఉందని అన్నారు. జిలానీ నే మొదటగా ఫైరింగ్ చేశారని గుర్తించామన్నారు. జిలానీ పై గతంలో కేసులు ఉన్నాయని ,రెండు నుండి మూడు రౌండ్స్ కాల్పులు జరిగాయని స్పష్టం చేసారు. అతి దగ్గర నుండి ఇస్మాయిల్ పై కాల్పులు జరిపినట్లు గుర్తించామని అన్నారు. ఇస్మాయిల్ వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నారని, నిందితుడు వాహనంలో ఇద్దరు ఉన్నారని పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో చనిపోయిన ఇస్మాయిల్ తో పాటు జహంగీర్ ఇంకా చికిత్స పొందుతున్నాడు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. నిందితులు కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని స్పష్టం చేసారు.

Show comments