Group-1 Exam: అలర్ట్.. గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈరోజే ఆఖరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-1 Exam: రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అప్లికేషన్లకు గడువు ఈ నెల 14నే ముగిసినా.. TSPSC రెండు రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవాలని సూచించింది. గత నెల 23 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తామని TSPSC ప్రకటించింది. అర్హత గల అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. గ్రూప్ -1 పరీక్షల కోసం ఇప్పటివరకు 2.7లక్షల దరఖాస్తులు వచ్చాయి.
పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. అప్లికేషన్ ప్రాసెస్ ఫీజును రూ. 200గా నిర్ణయించారు. ఎగ్జామినేషన్ ఫీజు రూ. 120గా నిర్ణయించారు. అయితే నిరుద్యోగులకు ఈ ఫీజు(ఎగ్జామినేషన్ ఫీజు) నుంచి మినహాయించారు. 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్నారు. గతంలో అప్లయ్ చేసుకున్న అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. గతంలో దరఖాస్తు ఫీజు చెల్లించిన కారణంగా ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Also Read
Read Also: Lok Sabha Election 2024 : దేశంలో ఓటర్లెంతమంది ? తమ ఎంపీని ఫస్ట్ టైం ఎన్నుకునే వాళ్లెందరు ?
ఇలా దరఖాస్తు చేసుకోండి….
* గ్రూప్ 1 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ లోకి వెళ్లాలి.
* ఓటీఆర్ లేని వారు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్ ఉన్నవారికి అవసరం లేదు.
* గ్రూప్ 1 ఆన్ లైన్ దరఖాస్తుల ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* మీ ఓటీఆర్ వివరాలతో లాగిన్ కావాలి.
* మీ వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
* ఫొటో, సంతకాన్ని అప్ లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుం చెల్లించాలి.
* సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి.
Lok Sabha Election 2024 : దేశంలో ఓటర్లెంతమంది ? తమ ఎంపీని ఫస్ట్ టైం ఎన్నుకునే వాళ్లెందరు ?
తాజావార్తలు
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
-
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!