NTV Telugu Site icon

SCCL : కారుణ్య నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌

కార్పొరేట్ ఏరియాలో మెడికల్‌ ఇన్‌వాలిడ్‌గా గుర్తించిన కార్మికుల పిల్లలకు ఎస్‌సిసిఎల్‌ జిఎం (పర్సనల్‌) కె.బసవయ్య కారుణ్య ఉపాధి ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్‌ ఇన్‌వాలిడ్‌ కార్మికులకు కారుణ్య ఉపాధి కల్పించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని, అందుకే గురువారం ఏడుగురికి నియామక ఉత్తర్వులు అందజేశామన్నారు. సంస్థలో ఉద్యోగం రావడం చాలా అదృష్టమని, నూతనంగా నియమితులైన కార్మికులు క్రమశిక్షణ, నిబద్ధతతో సంస్థ ప్రగతికి పాటుపడాలని, భద్రత సూత్రాలు, ఉన్నతాధికారుల ఆదేశాలను ఎల్లవేళలా పాటించాలని సూచించారు.

ఉపాధి ఉత్తర్వులు అందుకున్న కార్మికుల పిల్లలు ముఖ్యమంత్రి, సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డీజీఎం (పర్సనల్) ధన్ పాల్ శ్రీనివాస్, సీనియర్ పీఓలు సుశీల్ కుమార్, బేతి రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎస్‌సిసిఎల్‌ మహిళా సెల్‌ సభ్యులు బసవయ్య మాట్లాడుతూ మార్చి 5న మహిళా ఉద్యోగులకు క్రీడలు, క్రీడలు నిర్వహించి, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన కార్యాలయంలో బహుమతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.