75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్ లోని జాతీయగ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ (NIRD&PR) సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ .
ఈ సందర్భంగా NIRD&PR డైరెక్టర్ జనరల్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ… 75 వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారితో కలిసి 75 మెడిసినల్ ప్లాంట్స్ నాటాము. గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఎందరో గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగస్వామ్యం అయి మొక్కలు నాటుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ కార్యక్రమాన్ని అభినందించారు.. NIRD&PR క్యాంపస్ లో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతాము అని అన్నారు.
ఈ సందర్భంగా వారు చేస్తున్న కార్యక్రమాలను సంతోష్ గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించడం జరిగింది. వారు చేస్తున్న కృషిని చూసి సంతోష్ గారు అభినందించడం జరిగింది అన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, NIRD&PRడిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాధిక రస్తోగి,లెఫ్టినెంట్ కల్నల్ అశోతోష్ కుమార్ , రిజిస్ట్రార్ & డైరెక్టర్ (అడ్మిన్).. శశి భూషణ్, ప్రగతి రిసార్ట్ చైర్మన్ జిబికె రావు, డాక్టర్రవీందర్ ఇతర అధికారులు ,సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.
