NTV Telugu Site icon

MLC By Election: కొనసాగుతున్న గ్రాడ్యుయేట్స్ పోలింగ్.. 12 గంటల వరకు 33.19 శాతం

Mlc Bye Election

Mlc Bye Election

MLC By Election: వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలీసుల ప్రశాతంగా కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులంతా కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 12 గంటల వరకు 33.19 శాతం పోలింగ్ నమోదైంది. కాగా.. 12 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో)గా నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వ్యవహరిస్తున్నారు. జూన్ 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు.ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Read also: NVSS Prabhakar: ధాన్యం కొనుగోలు అవినీతిపై సీఎం ఎందుకు స్పందించడం లేదు..

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

మరోవైపు హనుమకొండలోని పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, ఆయన సతీమణి మమత ఓటు వేశారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మఠంపల్లి మండల కేంద్రంలోని వివేకవర్దిని ఉన్నత పాఠశాలలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ కాశీబుగ్గలోని వివేకానంద కళాశాలలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, నల్గొండ డైట్ స్కూల్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, హనుమకొండ తేజస్వీ స్కూల్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఓటింగ్‌లో పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు తనపై దాడి చేశారని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ ఆరోపించారు. నార్కట్‌పల్లిలో నగదు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్‌ నేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా తనను కొట్టారని ఆరోపించారు. వీడియో తీస్తున్న తన సిబ్బందిపై కూడా పార్టీ నేతలు దాడి చేసి సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆక్షేపించారు. ఈ క్రమంలో అశోక్ నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు.
Konathala Ramakrishna: పవన్ కళ్యాణ్ ఆశించిన ఫలితం రాబోతుంది.. ఎన్డీయే కూటమిదే గెలుపు..!

Show comments