NTV Telugu Site icon

గవర్నర్‌ తమిళసై అదిరిపోయే నిర్ణయం.. ఏంటంటే..?

తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్‌ లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు కొనుగోలు చేయలేని పరిస్థితిలో చాలా మంది పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. అలాంటి వారికోసం గవర్నర్‌ తమిళసై ఓ అడుగు ముందుకువేసి నిరుపయోగంగా ఉన్న ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని ఐటీ కంపెనీలను, సంస్థలను ఆమె విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా రాజ్‌భవన్‌లో దీని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఐటీ కంపెనీలే కాకుండా, దాతలు, విద్యార్థులు నిరుపయోగంగా పడిఉన్న వాటిని పేద విద్యార్థులకు ఇచ్చి వారి చదువుకు తోడ్పడాలని కోరారు. మరింత సమాచారం కోసం 9490000242 నెంబర్‌ కు సంప్రదించవచ్చునని ఆమె పేర్కొన్నారు.