Governor Tamilisai Appeal To Telangana Government On Cancer: క్యాన్సర్‌ని ఇన్సూరెన్స్ పాలసీలో చేర్చాలని.. గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేశారు. క్యాన్సర్ పేషంట్స్‌కి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తమిళిసై.. ఈ సందర్భంగా ఆ అప్పీల్ చేశారు. తాను ప్రభుత్వానికి, హెల్ మినిష్టర్‌కి కూడా లేఖ రాస్తానని అన్నారు. ఆయుష్మాన్ భారత్‌లో క్యాన్సర్ చికిత్స ఉందని.. కొన్నింటికి డయాగ్నస్, మరికొన్నింటికి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని తెలిపారు. 1990లలో క్యాన్సర్‌లో నాలుగో స్థానంలో ఉండేదని, ఇప్పుడు తొలి స్థానానికి వచ్చిందని అన్నారు. యువతులు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ భారిన పడుతున్నారని పేర్కొన్నారు.
కాలేజీ రోజుల్లో తాము క్యాన్సర్‌పై అవగహన కార్యక్రమం చేపట్టామని.. చాలా చోట్ల ఎగ్జిబిషన్స్‌లో మెడికల్ ట్రీట్మెంట్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసేవాళ్లమని తమిళిసై గుర్తు చేసుకున్నారు. ఏదైనా చిన్న సమస్య ఉన్నా వెంటనే చెక్ చేయించుకోవాలని, నెగ్లెక్ట్ చేయకండని సూచించారు. అవసరం ఉన్న వారికి రాజ్ భవన్ ఆదుకుంటుందని.. క్యాన్సర్‌పై పోరాటంలో భాగంగా రాజ్ భవన్ పింక్ లైటింగ్‌లో కనిపిస్తుందని హామీ ఇచ్చారు. కాగా.. ఈ కార్యక్రమానికి ఉషా లక్ష్మీ ఫౌండేషన్ ఛైర్మెన్ ఉషా లక్ష్మీ, కిమ్స్ హాస్పిటల్స్ ఛైర్మెన్ భాస్కర్ రావు హాజరయ్యారు. ఉషా లక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు గవర్నర్ చేతుల మీదుగా చంద్ర సుబ్బారావు రూ. 60 లక్షలు అందజేశారు. దీంతో.. చంద్ర సుబ్బారావు చేసిన సేవకి, ఫౌండేషన్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రోగులను ఆదుకుంటోన్న ఉషా లక్ష్మీకి, ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తోన్న భాస్కర్ రావుకి గవర్నర్ తమిళిసై ధన్యవాదాలు తెలిపారు.
