Site icon NTV Telugu

Gouravelli Project Issue: లాఠీ చార్జ్ చేయలేదు.. తోపులాట మాత్రమే జరిగింది..

Swetha

Swetha

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. మరో కొద్దిరోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ట్రయల్‌ రన్ ను అడ్డుకుంటారనే ఉద్దేశంతో ముందస్తుగా గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులను ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో అక్కడు ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీ చార్జ్ చేసారని .. సుమారు 100 మంది అదుపులో తీసుకున్నారని సమాచారం.

అయితే ఈ ఘటనపై సిపి శ్వేతా రెడ్డి పిసి స్పందించారు. గౌరవెల్లి ప్రాజెక్టు గుడాటిపల్లి కు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి పిర్యాదు రావడంతో.. గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి అధికారులకు సర్వే చేయడానికి సహకరించామని అన్నారు. సర్వేను అడ్డుకునే నిర్వాసితులను ముందస్తుగా అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులకు, నిర్వాసితులకు మధ్య తోపులాట జరిగిందని, అంతేకాని లాఠీచార్జి జరగలేదని స్పష్టం చేశారు. రైతులు మహిళలపై ఎలాంటి అదనపు ఫోర్స్ వినియోగించడం జరగలేదని అన్నారు.

పంప్ హౌస్ వద్ద ఎలాంటి ఆటంకాలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. భూమి కోల్పోతున్న నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది పెట్టే చర్యలకు గురి చేయలేదని వెల్లడించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నిర్వాసితులతో మాట్లాడుతున్నారని అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరపున శాంతియుతంగా నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని సిపి శ్వేతా స్పష్టం చేశారు.

Gouravelli Project Issue: సిద్దిపేట జిల్లాలో ఉద్రిక్తత.. పోలీసులు లాఠీఛార్జ్

Exit mobile version