Gold seized again in Shamshabad Airport: పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు అక్రమ బంగారం తరలింపికు అడ్డుకట్ట పడటం లేదు. అనుమానితులను అదుపులో తీసుకుని బంగారం సీజ్ చేస్తున్న యదేచ్ఛగా అక్రమ బంగారాన్ని తరలించడాన్ని ప్లాన్ వేస్తున్నారు. ప్రయాణికులకు సోదాలు చేస్తూ కస్టమ్స్ అధికారులు పంపిస్తున్న మిగతావారిలో ఆభయం కనిపించడం లేదు. ఇలాంటి వార్తలను మామూలు విషయంగానే తీసుకుంటూ అక్రమ బంగారాన్ని తరలించే పనిలో పడుతున్నారు. ఈరోజు శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలును నిర్వహించారు. విదేశాల నుండి అక్రమంగా తరలిస్తున్న 14 లక్షలు విలువచేసే అక్రమ బంగారం పట్టుకున్నారు అధికారులు. బంగారం పేస్ట్ గా తయారుచేసి క్యాప్సల్ రూపంలో కాళ్లకు వేసుకునే చెప్పుల కింద దాచాడు దుండుగులు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఓ ప్రయాణికుడు అనుమానంగా తిరుగుతుండటంతో.. అతన్ని అదుపులోకి తీసుకున్న స్కానింగ్ చెయ్యడంతో బంగారం గుట్టు రట్టయింది. బంగార్ని పేస్టులా చేసి, క్యాప్సల్ రూపంలో మార్చాడు. దాన్ని కాళ్లకు వేసుకునే చెప్పుల కింద దాచాడు. దీంతో అధికారులు ఆచెప్పులను పరిశీలించగా గుట్టురట్టైంది. పట్టుబడ్డ బంగారం 272 గ్రాములు, 14 లక్షల 28 వేలు ఉంటుందని ఆధికారులు అంచనా వేశారు. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితుని విచారణ చేపట్టారు.
read also: Shivamogga Subbanna: జాతీయ అవార్డు గ్రహీత.. ప్రముఖ సింగర్ శివమొగ్గ సుబ్బన్న కన్నుమూత
జూన్ 16వ తేదీన కువైట్ నుండి హైదరాబాద్ కు వచ్చిన మహిళ ప్రయాణికురాలు వద్ద బంగారం కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 1.646 కేజీల అక్రమ బంగారం పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టుకున్న బంగారం విలువ 86 లక్షలు ఉంటుందన్నారు. ఓ ప్రయానికురాలు పేస్ట్ రూపంలో సాక్స్ లలో బ్లాక్ కవర్ లో పెట్టి బంగారం తరలిస్తున్నట్లు వెల్లడించారు. మహిళ ప్రయానికురాలిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
అదేనెల జూన్ 12న కువైట్ నుంచి హైదరాబాద్‌కు జే9 403 నంబరు గల విమానంలో వచ్చిన ఓ వ్యక్తి నుంచి 551.21 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.. బంగారంపై రేడియం పూత పూసి ఇద్దరు మహిళల హ్యాండ్ బ్యాగులకు అమర్చి అక్రమంగా తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
జులై 11న దుబాయి నుంచి వచ్చిన ఓ మహిళ నుంచి 250 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారంపై వెండిపూత పూసి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుకున్న బంగారం విలువ దాదాపు పదిలక్షలకుపైగా ఉంటుందని తెలుస్తోంది.
Celebrate Rakhi Festival: సోదరుని ఇంట రక్ష బంధన్ వేడుకల్లో మంత్రి సబితమ్మ…
