NTV Telugu Site icon

TS POLYCET: పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. 86.63 శాతం సత్తా చాటిన బాలికలు

Ts Polises Girls

Ts Polises Girls

TS POLYCET: హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లోని తిక్షా భవన్‌లోని తన కార్యాలయంలో నవీన్ మిట్టల్ ఫలితాలను ప్రకటించారు. పరీక్షల్లో 82.17 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఎంపీసీ స్ట్రీమ్‌లో 85.73 శాతం, ఎంబీఐపీసీ స్ట్రీమ్‌లో 86.63 శాతం ఉత్తీర్ణతతో బాలికలు తమ సత్తా చాటారు. ఎంపీసీ స్ట్రీమ్‌లో 78.61 శాతం, బైపీసీ స్ట్రీమ్‌లో 78.62 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఈ నెల 17న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 98,274 మంది హాజరయ్యారు. వారిలో 54,700 మంది బాలురు, 43,574 మంది బాలికలు ఉన్నారు. ఎంపీసీ విభాగంలో 43,001 మంది బాలురు, 3,357 మంది బాలికలు అర్హత సాధించగా, బైపీసీ విభాగంలో 43,006 మంది బాలురు, 37,746 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సులు, అగ్రికల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నర్సింహారావు తెలంగాణ యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ పాలీసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 17న నిర్వహించబడింది. మే 17న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 296 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు 92.94 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. టీఎస్ పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 58,520 మంది బాలురు, 47,222 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. 54,700 మంది బాలురు, 43,573 మంది బాలికలు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా 98,273 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. అయితే ఈ పరీక్షకు సంబంధించిన అధికారిక ఆన్సర్ కీ ఇప్పటికే విడుదలైంది. అలాగే TS POLYCET ఫలితాలు 2023 మే 26న విడుదలైంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు.
Karnataka: అమ్మాయి, అబ్బాయి కలిసి తింటే అంతలా కొట్టాలా ?