NTV Telugu Site icon

Girlfriend Attacks Boyfriend: సీన్ రివర్స్.. ప్రియుడ్ని బ్లేడ్‌ తో దాడిచేసిన ప్రియురాలు

Girlfriend Attacks Boyfriend

Girlfriend Attacks Boyfriend

Girlfriend Attacks Boyfriend: ప్రేమించుకుంటారు పెళ్లి ప్రస్తావన వచ్చే ఎవరో ఒకరు ముఖం చేస్తుంటారు. ఇది ముఖ్యంగా అబ్బాయిలే అంటూ మనం చూస్తుంటాము. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఇద్దరు ప్రేమించుకుని అమ్మాయిని పెళ్లిచేసుకుందాం అంటే ప్రియుడిపై దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ప్రేమిస్తున్నాను పెళ్ళి చేసుకో అని అడిగిన ప్రియుడి పై బ్లేడుతో ప్రియురాలు దాడి చేసి హత్య యత్నానికి పాల్పడిన సంఘటన కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.

Read also: CM YS Jagan: దూసుకొస్తున్న తుఫాన్‌.. కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు

గుంటూరుకు చెందిన నాదెండ్ల అశోక్, రోడ్ నంబర్.4 లోని ఓ హాస్టల్ లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. రాజమండ్రికి చెందిన లక్ష్మిసౌమ్య, అదే రోడ్డులోని ఓ హాస్టల్ లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంది. వీరిద్దరికీ స్థానికంగా ఉండే ఒక టీ స్టాల్ వద్ద పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులకు ఆమెను ప్రేమిస్తున్నాను, వివాహం చేసుకుంటాను అని తెలపటంతో పాటు ఆమె ఖర్చులు భరిస్తూ సన్నిహితంగా ఉంటున్నాడు అశోక్‌. ఈ నెల 5న తేదీన రోడ్ నంబర్ 4లోని టీ స్టాల్ వద్ద ఇద్దరు కలిసున్న సమయంలో అశోక్ మళ్ళీ వివాహం చేసుకుందాము అనే ప్రస్తావన తీసుకుని రాగా ఆమె కాదనిందో లేక అక్కడ మాటమాట పెరిగింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అయితే అక్కడే ఉన్న స్థానికులు ఎంత చెప్పిన ఇద్దరు గొడవ పెనుతుఫానుగా మారింది. కోపంతో ఊగిపోయిన సౌమ్య తనతో పాటు తెచ్చుకున్న మినీ కట్టర్‌తో అశోక్‌ పై దాడి చేసింది. విచక్షణారహితంగా దాడికి పాల్పడింది.

ఈ దాడిలో అశోక్ చెంప కింద భాగంలో తీవ్రగాయమయ్యింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అశోక్ ను తరలించారు. ఈవ్యవహారం అశోక్‌ కుటుంబానికి తెలియడంతో హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు బోరున ఏడ్చారు. ఈఘటనకు కారుకురాలైన సౌమ్యపై బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు. నిందితురాలి పై హత్యాయత్నం కేసు నమోదు చేసుకొని, అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. రాత్రి 7 గంటల సమయంలో హౌసింగ్ బోర్డులో పెళ్లి ప్రస్తావని తీసుకురావడంతో అమ్మాయి తనతో తెచ్చుకున్న బ్లేడుతో అశోకుని గాయపరిచిందని పోలీసులు తెలిపారు. అశోక్ కుమార్ కి 50 కుట్లు వేసినట్లు డాక్టర్లు తెలిపారని పోలీసులు తెలిపారు.
Blast : క్వారీలో బ్లాస్టింగ్ ఇద్దరు మృతి.. రాళ్ళ గుట్టల్లో ఇరుక్కున్న మృతదేహాలు

Show comments