NTV Telugu Site icon

Girl Suspicious Death: వీడని సస్పెన్స్‌.. ఉద్రిక్తతల నడుమ చిన్నారి అంత్యక్రియలు

Girl Suspicious Death

Girl Suspicious Death

Girl Indu Suspicious Death: సంచలనం సృష్టించిన మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడలో చిన్నారి ఇందు మృతి కేస్ లో సస్పెన్స్ ఇంకా వీడలేదు. దర్యాప్తు కోసం 10 బృందాలు ఏర్పాటు చేశారు. చిన్నారి మృతికి గల కారణాలపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ లతోపాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో కేస్ విచారణ చేపట్టారు. ఇందు తల్లిదండ్రుల మొబైల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చిన్నారి ఇందు అంత్యక్రియలు ఇవాళ చేయనున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

గురువారం దమ్మాయిగూడ పరిధిలో బాలిక ఇందు అదృశ్యమైన ఘటన విషాదాంతంగా మారింది. గురువారం ఉదయం 9గంటలకు పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన బాలిక ఇందు శుక్రవారం అంబేడ్కర్‌ నగర్‌ చెరువులో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు గుండె పగిలేలా రోదిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన సాయంత్రం గర్ల్ మిస్సింగ్ కేస్ ను పోలీసులు కేసు నమోదు చేశారని బాలిక తలిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిన్ననే సెర్చ్ ఆపరేషన్ చేసుంటే బాలిక ఆచూకీ దొరకేదని చెబుతున్నారు. పోలీసుల జాప్యం వల్లే బాలికకు ఈ పరిస్థితి ఎదురైందనీ ఆరోపించారు. ఇందు మృతదేహాన్ని వైద్యపరీక్షలు చేయించారు. బాలిక ఒంటిపై గాయాలు లేవని, నీరుతాగి చనిపోయిందని తెలుపుతున్నారు. అయితే మృతురాలు ఇందు తల్లిదండ్రులు ఇందు పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వకుండా డెడ్ బాడీని అప్పగించారంటూ ఆందోళన చేపట్టారు.

Read also: US Fighter Jet Crash: హెలికాప్టర్ మాదిరి ల్యాండింగ్.. అదుపు తప్పి కూలిన ఫైటర్ జెట్

పోలీసులు వాహనాలపై కర్రెలతో దాడి చేశారు. అయితే ఇవాల ఇందు అంత్యక్రియల నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్తత చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఉద్రిక్తతల నడుమ ఇందు అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే.. పాప ఒంటిపై గాయాలు, నడుము భాగంలో గాయాలు గుర్తించామని చెబుతున్నారు. నిన్న రాత్రి చెరువు వరకు డాగ్స్‌స్క్వాడ్ వెళ్ళిందని, అక్కడ మమ్మల్ని పంపీయలేదని వాపోయారు. పోలీసులకు నిన్న రాత్రే విషయం తెలుసని, పోలీసులు దాచి పెట్టారని చెబుతున్నారు. మా పాపపై అఘాయిత్యానికి పాల్పడే చంపారని కన్నీరుమున్నీరవుతున్నారు బాధిత తల్లిదండ్రులు. ఈ విషయం తెలిసే పోలీసులు నిన్న చెప్పకుండా దాచి పెట్టారంటున్న కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ ఎక్కువగా ఉంటుందని, అలాగే ఇటుక బట్టీలు తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారని తెలుపుతున్నారు. వాళ్లలో ఎవరైనా పాపపై అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాధిత తల్లిదండ్రులు. ఎక్కడో వేరే దగ్గర చంపి తీసుకొచ్చి చెరువు దగ్గర పాప డెడ్‌బాడిని పడేశారని గుండెపగిలేలా రోదిస్తున్నారు. అయితే అనుమాదాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.