NTV Telugu Site icon

PM Modi: మోడీ సభలో యువతి హల్ చల్ .. వీడియో వైరల్

Pm Modi

Pm Modi

PM Modi: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న మాదిగ విశ్వరూప మహాసభకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఎస్సీ వర్గీకరణపై త్వరలో కమిటీ వేస్తామన్నారు. ఇక నుంచి తాను మంద కృష్ణ మాదిగ ఉద్యమంలో ఒకడినని పేర్కొన్నారు. మంద కృష్ణ మాదిగ నాయకుడిగా ఉండి ఉంటే ఆమెకు సహాయకుడిగా ఉండేవారని అన్నారు. ప్రధాని మాట్లాడుతుండగా కొన్ని సెకన్ల పాటు సభలో గందరగోళం నెలకొంది. ఒక అమ్మాయి త్వరగా లైట్ టవర్ ఎక్కడం ప్రారంభించింది. ప్రధాని మాట్లాడుతుండగా.. తెల్లటి దుస్తులు ధరించిన ఓ యువతి వీపుపై బ్యాగ్ పెట్టుకుని టవర్ ఎక్కింది. ప్రధానితో మాట్లాడేందుకు ఆమె టవర్ ఎక్కారు. ఇంతలో ప్రధాని మోడీ వెంటనే అలర్ట్ అయ్యారు. దిగి రావాలని కోరారు. పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయకూడదని మంచిది కాదని, షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని ప్రదాని సూచించారు.

‘బిడ్డ దిగి రావాలి. ఇది సరికాదు. నేను మీతో ఉన్నాను. నీ కోసమే ఇక్కడికి వచ్చాను. మీ మాట వినడానికి వచ్చాను. ఇలా చేయడం సరికాదు.. మందకృష్ణ మాట వినాలి’ అని ప్రధాని మోడీ ఆ యువతిని అభ్యర్థించారు. ఆ తర్వాత అక్కడ ఉన్న కొందరు యువకులు, పోలీసులు ఆమెను కిందకు దించారు. అయితే ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఆమె స్తంభం ఎక్కి నిరసన తెలిపినట్లు వెలుగులోకి వచ్చింది. మోడీ పాలన వచ్చిన తర్వాత కులం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతిరోజూ హత్యలు జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఒక్క మతాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని బాలిక ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీ పాలనలో అన్నీ ప్రైవేటీకరించబడుతున్నాయని ఆగ్రమం వ్యక్తం చేసినట్లు విశ్వనీయ సమాచారం. చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయి.. కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చదువుకోవాలంటే.. లక్షల్లో ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని, మాలాంటి పేదలకు మేలు జరగడం లేదని ఆ యువతి చెప్పింది.

ఇక మాదిగ విశ్వరూప సభలో ప్రధాని కీలక ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలో కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటాన్ని కొనియాడిన మోదీ.. మందకృష్ణ పోరాటానికి ఇప్పుడు మరో మిత్రుడు వచ్చిందన్నారు. మాదిగ వర్గానికి న్యాయం జరిగేలా చూడాలన్నదే తన కోరిక అని మోదీ వెల్లడించారు. అయితే అంతా సవ్యంగా సాగుతున్న మోదీ సమావేశంలో ఆయన లైట్ టవర్ ఎక్కడం చర్చనీయాంశంగా మారింది.

Bigg Boss 7 Telugu: రతిక ఫెయిల్ కంటెస్టెంట్ అంటూ టార్గెట్ చేసిన ప్రశాంత్.. కెప్టెన్ అయిన శివాజీ..