NTV Telugu Site icon

Ganja gang: మైలార్ దేవుపల్లిలో గాంజా గ్యాంగ్ వీరంగం.. కత్తులు, రాళ్లతో దాడి

Mailar Devurapalli

Mailar Devurapalli

Ganja gang: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలో గంజాయి ముఠా రెచ్చిపోతున్నారు. గత నెల ఓ మైనర్‌ బాటుడిపై దాడి చేసిన ఘటన మరువకముందే మరో ఘటన మైలార్‌ దేవ్‌ పల్లిలోనే చోటుచేసుకోవడం రంగారెడ్డి ప్రజలు భయాందోళనకు గురవతున్నారు. హైదరాబాద్‌ లో గంజాయి విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. కొంతమంది యువత మత్తుకు బానిసై, అరాచకాలకు పాల్పడుతున్నా వారి యువత ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. గంజాయి సేవించి గ్యాంగ్‌ లుగా ఏర్పడి నానాహంగామా సృష్టిస్తూ.. మత్తులో తూగుతూ రోడ్లమీద భయాందోళనకు దిగుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆమత్తులు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

మైలార్‌ దేవుపల్లిలో గాంజా గ్యాంగ్‌ వీరంగం సృష్టించింది. మైలార్‌ దేవుపల్లిలోని రావుల భాస్కర్ లో బాబుల్ రెడ్డి బస్తీ కి ఆనుకొని ఉన్న బృందావన్ కాలనీ ఉంటోంది. అక్కడ ఒక చిన్న గొడవ జరుగుతుండటంతో రావుల భాస్కర్ కలుగ జేసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా 50 మంది గాంజా గ్యాంగ్ భాస్కర్ పై దాడి చేశారు. నువ్వు మాకు చెప్పేవాడివా అంటూ దాడిచేస్తున్నవారిని భాస్కర్ కొడుకు అడ్డుకునే ప్రయత్నం చేయగా కుమారుని పై కూడా గాంజాగ్యాంగ్ విరుచుకుపండి. మూకుమ్ముడిగా దాడి చేసింది. ఈ దాడిలో రావుల భాస్కర్ కు కత్తి పోట్లు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కాలనీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఏం జరుగుతుందనే బయటకు రావడంతో భయబ్రాంతులకు గురైన కాలనీ వాసులు గాంజా గ్యాంగ్‌ ను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. 50 మంది గాంజా గ్యాంగ్‌ కాలనీ వాసులపై విరుచుకుపడి విచక్షణారహితంగా దాడి చేసింది. అడ్డుకోవడానికి వచ్చిన కాలనీ వాసులపై కూడా రాళ్లు విసిరడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన చేరుకుని, క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎక్కువగా గాంజాగ్యాంగ్ రంగారెడ్డి జిల్లాలోనే ఉండటం గమనార్హం. అక్కడ యువత గాంజా సేవిస్తూ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికి గాంజా ఎక్కడ దొరుకుతుంది? అంటే చాలు రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలో అంటారు. ఎందుకంటే అక్కడే గ్యాంగ్ వార్ లు, దాడులు, పట్టుబడిన వారందరూ గాంజా సేవించి ఉండటం. అధికారులు స్పందించి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read also: Man Infected By Killer Plant : మొక్కల నుంచి మానవునికి వ్యాధులు

గంజాయి మత్తులో ఓ మైనర్ బాలుడిపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. కిరాణా షాపులో కూర్చున్న బాధిత బాలుడిని ముఠా సభ్యులు బలవంతంగా సమీపంలోని కొండలపైకి తీసుకెళ్లారు. అంతే కాకుండా బాధితురాలి బట్టలు విప్పి డబ్బులు డిమాండ్ చేస్తూ కర్రలు, బెల్టులతో తీవ్రంగా కొట్టారు. వారి నుంచి తప్పించుకున్న బాలుడు ఇంటికి చేరుకోగా, కుటుంబ సభ్యులు తలపై గాయాలు చూసి ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అబ్బు, సమీర్, మహ్మద్ సైఫ్‌లతో పాటు మరో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఇద్దరిని చంపేశామని ముఠా సభ్యులు బాలుడిని బెదిరించినట్లు సమాచారం. ఇది ఇలా వుంటే..
India- Russia: భారత్‌తో మైత్రి బలోపేతం దిశగా..

Show comments