NTV Telugu Site icon

Gangula Kamalakar : గన్నీలు, గోదాములు, ర్యాకుల కేటాయింపు పెంచాలి

Gangula

Gangula

తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గంగుల కమలాకర్ ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యం సీఎంఆర్‌లో రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎఫ్‌సీఐ సహకరించాలని మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. అంతేకాకుండా ఇక్కడి వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రైతుల్ని ఇబ్బంది పెట్టవద్దని, గన్నీలు, గోదాములు, ర్యాకుల కేటాయింపు పెంచాలని ఆయన విన్నవించారు.

ప్రతీ నెల 9 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోవాలని ఆయన అన్నారు. ధాన్యం సేకరణ పర్యవేక్షణకు ఎఫ్‌సీఐ సివిల్ సప్లైస్ నోడల్ అధికారులు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే 34 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినట్లు మంత్రి గంగుల తెలిపారు. పక్క రాష్ట్రాల నుండి ఒక్క గింజ రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. యాసంగి ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.

Revanth Reddy : రాజకీయ ప్రయోజనాల కోసమే టీఆర్‌ఎస్‌, బీజేపీ డ్రామాలు