Site icon NTV Telugu

సిరిసిల్ల, సిద్దిపేటలా హుజురాబాద్‌ అభివృద్ది చేస్తాం : గంగుల

హుజురాబాద్‌ ప్రచారంలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ది జరుగాలని ఎమ్మెల్యేలుగా ప్రజలు గెలిపిస్తారని…మరీ ఈటెల రాజేందర్ ను గెలిపిస్తే ఏం చేసారని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదని…కేసీఆర్ దగ్గర నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేయాల్సి ఉండాల్సిందన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తరహాలో హుజురాబాద్‌ను అభివృద్ది చేస్తామని..నిధులకు కొరత లేదని హామీ ఇచ్చారు. హుజురాబాద్‌ నియోజక వర్గంలో ఒక్క రోడ్డు లేదు. దుమ్ము, దూళీ తప్ప ఏం కనిపించడం లేదని మండిపడ్డారు.

read also : ప్రధానమంత్రి మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ

రోడ్ల ను ఊడ్చే దిక్కు లేదని.. జమ్మికుంట పట్టణం మొత్తం దుర్గంధ మయమైందన్నారు. నేను కూడా కరీంనగర్ నుండి గెలిచాను…కానీ అభివృద్ధి చేశానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత కరీంనగర్ అన్ని విధాలుగా అభివృద్ది చెందిందన్నారు. ఆర్థిక, పౌర సరఫరాల, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఏడున్నర సంవత్సరాలు పని చేశాడు.. కానీ ఈటెల ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు గంగుల.

Exit mobile version