Site icon NTV Telugu

Gangster Ayub Khan Released: ఐదేళ్ల తరువాత విడుదలైన పాతబస్తీ గ్యాంగ్‌స్టర్

Ayub Khan

Ayub Khan

Gangster Ayub Khan Released: ఐదేళ్ల చంచల్ గూడ జైల్లోనే విడుదలైన పాతబస్తీ గ్యాంగ్‌ స్టర్‌ అయూబ్‌ ఖాన్‌ ఇవాళ విడుదలయ్యాడు. నకిలీ పాస్‌పోర్టు కేసుకు సంబంధించి అరెస్టయిన పాతబస్తీ గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ఖాన్‌ జైలు నుంచి నేడు విడుదలయ్యాడు. గతంలో.. 2017లో సౌదీ అరేబియా నుంచి నకిలీ పాస్‌పోర్టుతో వచ్చాడనే కారణంతో ముంబయి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అయూబ్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

దీంతో.. అయూబ్‌కు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించగా, సుమారు ఐదేళ్లుగా చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. అయూబ్‌పై పాతబస్తీ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయి. అయూబ్‌ ఖాన్‌ 2010లో హైదరాబాద్‌లోని గోల్కండ చిరునామాతో నకిలీ పాస్‌పోర్టును తీసుకున్నాడు. ఈనేపథ్యంలోనే.. దీనికి సహకరించిన అతడి భార్య హఫీజా బేగం, మరో ఇద్దరు ఖాజీలను కాలాపత్తర్‌ పోలీసులు గతంలో అరెస్ట్‌ చేశారు.

అయితే.. అయూబ్‌ చేసిన నేరాల్లో న్యాయవాది మన్నన్‌ ఘోరీ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. కాగా.. మన్నన్‌ ఘోరీ ఖరీదు చేసిన ఓ ఇంటికి సంబంధించి అయూబ్‌ రూ.2.5 లక్షల మామూలు డిమాండ్‌ చేశాడంతో.. దానికి నిరాకరించడంతో 2002 జూలై 10న తన నలుగురు అనుచరులతో కలసి దారుణంగా హత్య చేశాడు. ఈహత్య కేసులో కింది కోర్టు అయూబ్‌కు జీవితఖైదు విధించింది. ఈనేపథ్యంలో.. మూడేళ్ల జైలు జీవితం అనుభవించిన తర్వాత పైకోర్టు ద్వారా బెయిల్‌ పొంది 2014 ఏప్రిల్‌ 11న విడుదలయ్యాడు.

Exit mobile version