NTV Telugu Site icon

గాంధీ ఆస్ప్రతిలో మంటలు

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్ప్రతి అగ్నిప్రమాదం జరిగింది.. లేబర్‌ రూమ్‌లోషార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ బ్లాక్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్రమంగా మంటలు థర్డ్‌ ఫ్లోర్‌ నుంచి ఫస్ట్‌ ఫ్లోర్‌ వరకు వ్యాపించాయి. ఊహించని ఘటనతో షాక్‌ తిన్న సిబ్బంది, రోగులు.. భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. పలువురు రోగులు ఆస్పత్రిలోపలే ఉండిపోయారు.. దీంతో మంటల్లో చిక్కుకు పోయిన రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగి.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై ఫోకస్‌ పెట్టారు అధికారులు.