NTV Telugu Site icon

Gajendra Singh Shekhawat : సీఎం చేయడానికి తెలంగాణలో ఒక దళితుడు దొరక లేదా

Gajendra Singh Shekawat

Gajendra Singh Shekawat

Union Minister Gajendra Singh Shekhawat Criticized CM KCR.
తెలంగాణలో రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట రెండు దఫాలుగా పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నేడు యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకుని యాదాద్రి భువనగిరి నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రిలో ఏర్పాటు చేసిన బీజేపీ భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ నీ సింహాసనం ఖాళీ చెయ్యి.. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఎందుకు పోరాటం చేసారో ఆ కలలు సాకారం కాలేదు. ఎక్కడ చూసినా అవినీతే… కుటుంబము కోసం మాత్రమే పని చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో కేసీఆర్‌ ఎవరి వైపు నిలిచారు.

ఆదివాసీ కోసం నిలబడలేదు… కుటుంబం కోసం ఆలోచించే వారి పక్షాన నిలిచాడు. సీఎం చేయడానికి తెలంగాణలో ఒక దళితుడు దొరక లేదా. ముఖ్యమంత్రి కోసం ఇంట్లో కొట్లాటలు జరుగుతున్నాయి. 2023 లో బీజేపీ అధికారం లోకి వస్తుంది.. తెలంగాణ బిడ్డ సీఎం అవుతారు. గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతో జరుగుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతి పరులను జైలుకు పంపిస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు.