NTV Telugu Site icon

Distribution of Sheep: నేటి నుంచి గొర్రెల పంపిణీ.. మంచిర్యాలలో సీఎం, నల్లగొండలో తలసాని

Distribution Of Sheep

Distribution Of Sheep

Distribution of Sheep: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గొల్ల, కురుమలకు 2వ దశ సబ్సిడీ గొర్రెల పంపిణీ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంచిర్యాల జిల్లాలో, రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నల్లగొండ జిల్లా నగిరేకల్‌లో ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో 2వ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. కులవృత్తుల వారిని ప్రోత్సహించాలనే.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఆలోచనల నుంచి గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి స్వయంగా రూపొందించారు. గొర్రెల పెంపకం వృత్తిగా జీవిస్తున్న గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే తలంపుతో ప్రభుత్వం సుమారు 11 వేల కోట్ల రూపాయలతో గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.

Read also: CM KCR: నేడు మంచిర్యాలకు సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇదే..

ముందుగా రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన గొల్ల, కురుమలను గుర్తించి గొర్రెల పెంపకందారుల సొసైటీల్లో సభ్యత్వం కల్పించేందుకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. వీరికి ఒక యూనిట్ గా 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉండగా ఒక్కో యూనిట్ ధర లక్షా 25 వేల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వం 75 శాతం (రూ. 93,750), లబ్ధిదారుల వాటా 25 శాతం (రూ. 31,250) చెల్లించాలి. మొదటి దశలో రూ.5 కోట్లతో 3 లక్షల 93 వేల 552 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ఇందులో ప్రభుత్వ వాటా నిధులు 3 వేల 751 కోట్ల రూపాయలు కాగా, లబ్ధిదారుల వాటా 1,250 కోట్ల రూపాయలు. గొర్రెల ధర పెరగడంతో 2వ దశలో యూనిట్ ధర రూ. ఇందులో ఒక్కో యూనిట్‌కు ప్రభుత్వ వాటా మూలధనం లక్షా 31 వేల 250 రూపాయలు కాగా, లబ్ధిదారుడి వాటా 43,750 రూపాయలు. నేటి నుంచి 2వ దశలో 3 లక్షల 37 వేల 816 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం 6085 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. ఇందులో ప్రభుత్వ వాటా రూ.4,563.75 కోట్లు కాగా, లబ్ధిదారుల వాటా రూ.1521.25 కోట్లు. లబ్ధిదారులకు గొర్రెల బీమా సౌకర్యంతోపాటు గొర్రెల యూనిట్‌ను అందజేస్తామన్నారు. ఒక గొర్రె చనిపోతే మరో గొర్రెను కొనుగోలు చేసి బీమా క్లెయిమ్‌గా ఇస్తారు. దీంతోపాటు గొర్రెలను కొనుగోలు చేసిన ప్రాంతం నుంచి లబ్ధిదారుల ఇంటికి చేర్చేందుకు అవసరమైన మందులు, రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది.
Railway Income: రైల్వేకు శుభవార్త.. ఒక్క నెలలోనే రూ. 14,642 కోట్లు

Show comments