NTV Telugu Site icon

South Central Railway: సికింద్రాబాద్ నుంచి తక్కువ టైమ్ లో గుంటూరు, విజయవాడకు వెళ్లొచ్చు..

Gunturu

Gunturu

South Central Railway: రైల్వేల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే లైన్ల ఆధునీకరణతో పాటు సింగిల్ లైన్ రూట్లను డబుల్ లైన్లుగా, డబుల్ లైన్ రూట్లను ట్రిపుల్ లైన్లుగా మార్చేందుకు పనులను చేపట్టారు. ప్రధాన నగరాల్లోని అన్ని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో తీర్చిదిద్దుతున్నారు. వందే భారత్ రైళ్లను సెమీ-హై స్పీడ్ రైళ్లుగా కూడా ప్రవేశపెట్టి.. ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా చేయాలనే ఉద్దేశ్యంతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేవిధంగా చేశారు. కాగా.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు-సికింద్రాబాద్ మార్గం చాలా కీలకంగా మారింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు వెళ్లే రైలు మార్గాలకు ఇది ప్రత్యామ్నాయం. రైళ్ల రాకపోకలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు సింగిల్ లైన్ గా ఉన్న గుంటూరు-బీబీనగర్ మార్గాన్ని డబుల్ లైన్ గా విస్తరిస్తున్నారు.

Read also: CM Revanth Reddy: ఆగస్టు 1, 2న బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధం..

దీంతో సికింద్రాబాద్ నుంచి గుంటూరు, విజయవాడకు ప్రయాణ సమయం తగ్గుతోంది. సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు మూడు గంటల్లో, విజయవాడకు మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు. డబుల్ లైన్ పనులు చేపట్టేందుకు గుంటూరు జిల్లాల్లో భూమి అవసరం కావడంతో రైల్వే శాఖ భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే రైల్వేలైన్ సమీపంలో భూములు ఉన్నా.. మరికొన్ని అవసరం కావడంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాడికొండ మండలం బండారుపల్లిలో 9.099 ఎకరాలు, గుంటూరు పశ్చిమ మండలం చినపలకలూరులో 9.463 ఎకరాలు, మేడికొండూరు మండలం సిరిపురంలో 15.809 ఎకరాలు, అదే మండలం మండపాడులో 7.35 ఎకరాలు, విశాలాలలో పది సెంట్లు, నల్లపాడులో 5.958 ఎకరాలు. అభ్యంతరాలను నెల రోజుల్లోగా గుంటూరు ఆర్డీఓకు సమర్పించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గుంటూరు ఆర్డీఓ కార్యాలయం కాంపిటెంట్ అథారిటీ. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.
Revanth Reddy Vs Jagadish Reddy: అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డిల మధ్య డైలాగ్‌ వార్‌..