NTV Telugu Site icon

KTR: ఫ్రీ బస్సు మాయం కావడం ఖాయం.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

Free Bus Ktr

Free Bus Ktr

KTR: ఫ్రీ బస్సు మాయం కావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం పోగానే కొంత మంది తమ దారులు వెతుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవులను అనుభవించిన వారు సైతం జారుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు పోయినా కార్యకర్తలు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించారని అన్నారు. 100 రోజుల్లో గ్యారంటీ లు అమలు అని గద్దెను ఎక్కారని అన్నారు. ఎం చేశారో ఆలోచించాలని ప్రజలకు ఉద్దేశించి మాట్లాడారు. డిసెంబర్ 9న రుణ మాఫీ చేస్తాం అన్నారు. కానీ ప్రమాణ స్వీకారం మాత్రం రెండు రోజుల ముందు చేసారు..2 లక్షల రుణ మాఫీ గాలికి వదిలేశారని తెలిపారు. రైతులు కర్రు కాల్చి వాత పెడుతారు అని ఆగస్టు 15 అంటూ సిఎం డైలాగ్ లు చెప్పుతున్నారని తెలిపారు.

Read also: Jaya Jaya Jaya Jaya Hey : తెలుగులో రీమేక్ కానున్న మలయాళం సూపర్ హిట్ మూవీ.. హీరో ఎవరంటే..?

కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడితే నే అన్ని నెరవేరుతాయన్నారు. ఫ్రీ బస్సు మాయం కావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. లంకె బిందెలు అంటున్నారు.. లంకె బిందెల కోసం ఎవ్వరు తిరుగుతారు. అది పచ్చి దొంగలు తిరుగుతారని అన్నారు. రైతు బంధు అడిగితే కోమటి రెడ్డి చెప్పు తో కొడతా అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది.. తాగు నీళ్ళు లేవని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మోస పోవాలని కోరుకుంటారు అని చెప్పి మరీ మోసం చేసారన్నారు. మనం ఎం చేశామో చెప్పుకో లేక పోవడం మన తప్పని తెలిపారు. మొన్న కాంగ్రెస్ ఇచ్చిన 32 వేల ఉద్యోగాల కాగితాలు మనం ఇచ్చిన వే అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పై ప్రజలు మంట మీద ఉన్నారని అన్నారు.

Read also: Sunitha Kejriwal : గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సునీతా కేజ్రీవాల్

పిల్లలు పుట్టాలి అంటే లగ్గం కావాలి.. నోటిఫికేషన్ ఇవ్వక ముందే కాంగ్రెస్ ఎలా ఉద్యోగాలు ఇచ్చారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెట్ కోసం 2 వేల ఫీజు పెట్టారన్నారు. కాంగ్రెస్ మాటలు ఆకాశంలో చేతలు పాతాళం లోనే అన్నారు. ఉద్యోగాలకు అత్యధికంగా ఇచ్చినా వాళ్ళ మనస్సును సైతం గెలుచు కో లేక పోయామన్నారు. ఎందుకు అంటే సమయానికి జీతం ఇవ్వలేదన్నారు. కొమురం భీం ఆశయాలను నెరవేర్చింది బీఆర్ఎస్ అన్నారు. ఇంద్రవెల్లి లో ఆదివాసి లను కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. అమర వీరులకు కనీసం క్షమాపణ చెప్పలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల భ్రమలు తొలగి పోతాయన్నారు. పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్లే జబ్బలు జారెస్తున్నరని తెలిపారు.

Read also: UPSC Civils 2023 Results: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలు విడుదల.. ఆదిత్య శ్రీవాత్స‌వ‌కు తొలి ర్యాంకు!

నాయకులు పదవులు , పైరవీల కోసం పార్టీలు మారుతున్నారని తెలిపారు. ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది గులాబీ జెండా నే అన్నారు. పేగులు మెడలు వేసుకుంటా అంటున్నారు.. ఆయన సీఎం నా బోటి కొట్టే వ్యక్తా? అని ప్రశ్నించారు. నీ ప్రభుత్వమును కొల్లగొట్టే ఖర్మ మాకు పట్టలేదన్నారు. ఐదేళ్లు మీ ప్రభుత్వం ఉండాలి..
5 ఏళ్లు నడుపు 420 హామీలు నెరవేర్చు అన్నారు. ఉద్యమ సమయంలో ఎవ్వరు ఉన్నారో వాళ్ళే ఇప్పుడు పార్టీలో ఉన్నారని తెలిపారు. రాహుల్ గాందీ మోడీని చోర్ అంటే రేవంత్ రెడ్డి మాత్రం బడే బాయ్ అంటున్నారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణ లో మార్పులు వస్తాయి. నంబర్ వన్ జంప్ అయ్యే వ్యక్తే రేవంత్ రెడ్డి అన్నారు.

Read also: Shankar Daughter : శంకర్ కూతురు రీసెప్షన్లో చిరు ఫ్యామిలీ…

రేవంత్ రెడ్డి రాహూల్ గాంధీ మనిషా , మోడీ మనిషా ఆలోచించాలని అన్నారు. దమ్ముంటే మీ కాంగ్రెస్ నేతలు చెప్పాలి రేవంత్ ఏ పార్టీ నేత నో చెప్పండి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఓటు కాంగ్రెస్ కు వేసిన అది బీజేపీకి పోతుందన్నారు. బీజేపి మరో సారి అధికారం లోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ లు పోతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ను అమ్ముతున్నందుకు మోడీ దేవుడా? అని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏది? ఆదిలాబాద్ లో సిసి ఐ రీ ఓపెన్ ఎక్కడ? అని ప్రశ్నించారు. రాముడి ని మొక్కు దాము. తెలంగాణ కు పైసా పని చేయని బిజేపి ని తొక్కుదామని అన్నారు.
Lamba Dinakar : నేడు ఆర్ధికంగా అన్ని ఆదాయాలు పడిపోయి.. అవస్థలు పడుతున్నారు

Show comments