Fraud in mutton, chicken, fish weight: తూకాలలో మోసాలు.. అడ్డూ అదుపు లేకుండా కల్తీ వ్యాపారాలు. తూకంలో జరిగినన్ని మోసాలు మరెందులోనూ జరగవంటే అతిశయోక్తి కాదు. పాల నుంచి పప్పు వరకు, కిరోసిన్ నుంచి కూరగాయల వరకు అన్నీ తప్పుడు తూకాలే. అంతేకాదు చిల్లర కొట్టు బండి నుంచి బడా మాల్స్ వరకు ఇదే పరిస్థితి. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్‌లో చేతివాటం.. బంగారం తూచే మిషన్లు ఇలా అన్నింట్లోనూ మోసాలే. అయితే.. కొంతమంది వ్యాపారులు ఏండ్ల తరబడి ఒకే తూకంరాళ్లను వినియోగిస్తున్నారు. కాగా.. కిలో తూకంరాయి ని చూస్తే దానిపై ముద్రించిన అక్షరాలు సైతం అరిగి పోయి ఉంటున్నాయి. దీంతో.. వినియోగదారుల అవగాహనలేమి వల్ల మార్కెట్‌లో ప్రతి వస్తువు ధరను వ్యాపారులు నిర్ణయిస్తున్నారు.. ఈనేపథ్యంలో.. వ్యాపారులు తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడుతూ.. యథేచ్ఛగా అమ్ముతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులతో మార్కెట్‌లన్నీ నిండుగా మారుతాయి. ఆరోజు మటన్, చికెన్, ఫిష్ లేనిదే ముద్దదిగదు. అంతే అది ఫిక్స్ అయిపోయారు మన నాన్‌వెజ్ ప్రియులు. అయితే ఇదే అలుసుగా తీసుకుని మార్కెట్ లో మోసాలకు పల్పాడుతున్నారు.
మటన్, ఫిష్ ఇతర దుకాణాల వద్ద తూకాలలో మోసాలకు పాల్పడుతున్నారు. ఈఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మార్కెట్ యార్డ్ లో జరుగుతున్నాయని సంబంధిత జిల్లా అధికారులకు ఫిర్యాదు అందడంతో జిల్లా అధికారి రామ్మోహన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మటన్, ఫిష్ అమ్మకాలు చేస్తున్న వారి తూకానికి సంబంధించిన బాట్లను పరిశీలించి అవాక్కయ్యారు. ఒక కేజీ బాటుకు 750 గ్రాములు మాత్రమే ఉంచి వినియోగదారులను మోసం చేస్తున్నారని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మటన్, ఫిష్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులపై జరిమానాలు విధించామని జిల్లా అధికారి తెలిపారు. వినియోగదారులను మోసాలు చేస్తే చూస్తూ ఊరుకోమని కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు..మటన్ వ్యాపారస్తులు, కూరగాయల వ్యాపారస్తులు, ఎలక్ట్రానిక్ కాంటాలు ఉపయోగించే విధంగా తునికల కొలతల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మోసాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి తీసుకువస్తే అలాంటి వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన ప్రజలకు సూచించారు.
Online Fraud: లాటరీ వచ్చిందని.. 6లక్షలు దోచేసిన కేటుగాళ్లు
